Secunderabad: రూబీ హోటల్‌ ఫైర్‌ యాక్సిడెంట్‌ కేసులో నలుగురు అరెస్ట్.. అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం..

రూబీ హోటల్‌ ఫైర్‌ యాక్సిడెంట్‌ కేసులో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రంజిత్ సింగ్ బగ్గా, సుమిత్ సింగ్ బగ్గా, మేనేజర్ సుదర్శన్ నాయుడుతో పాటు

Secunderabad: రూబీ హోటల్‌ ఫైర్‌ యాక్సిడెంట్‌ కేసులో నలుగురు అరెస్ట్.. అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం..
Ruby Hotel Fire Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 14, 2022 | 8:54 PM

Secunderabad Ruby Hotel Fire Accident: రూబీ హోటల్‌ ఫైర్‌ యాక్సిడెంట్‌ కేసులో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రంజిత్ సింగ్ బగ్గా, సుమిత్ సింగ్ బగ్గా, మేనేజర్ సుదర్శన్ నాయుడుతో పాటు, సూపర్ వైజర్‌ను అరెస్ట్‌ చేశారు. ప్రమాదస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. రూబీ హోటల్‌కు చెందిన డాక్యుమెంట్స్‌ పరిశీలించారు. సెల్లార్‌ ప్రాంతంలోని సీసీకెమెరా ఫుటేజీని అధికారుల బృందం తీసుకెళ్లింది. అలాగే జనరేటర్లు, సిలిండర్లు, ఈ-మోటార్ల ఫొటోలు తీసుకున్నారు. హోటల్ మేనేజర్ సుదర్శన్‌ను ఘటనాస్థలానికి తీసుకెళ్లిన పోలీసులు.. అనేక కోణాల్లో ప్రశ్నలు సంధించి సమాధానాలను సేకరించారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 9 గంటల సమయంలో ఎలక్ట్రికల్‌ బైక్‌ షోరూమ్‌ను మూసేసి రంజిత్‌ సింగ్‌, అతని కుమారుడు సుమిత్‌ సింగ్‌ కార్ఖాలోని ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత 9గంటల 45నిమిషాల సమయంలో లాడ్జ్‌ సిబ్బంది ఫోన్‌ చేసి అగ్ని ప్రమాదం గురించిన సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకునేసరికే జరగరాని ఘోరం జరిగిపోయింది. దీంతో అక్కడి నుంచి పరారైన తండ్రీకొడుకులు.. మేడ్చల్‌ ఫార్మ్‌ హౌస్‌లో తలదాచుకున్నారు. అప్పటి నుంచి వారి కోసం గాలించిన పోలీసులు.. ఫార్మ్‌ హౌస్‌లో ఉన్నట్టు తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లిచ్చిన సమాచారం మేరకు లాడ్జ్‌ మేనేజర్‌ సుదర్శన్‌ నాయుడు, సూపర్‌వైజర్లను కూడా అరెస్ట్‌ చేశారు.

లిథియం బ్యాటరీ పేలుళ్ల కారణంగానే ప్రమాదం జరిగినట్టు ఫైర్ డిపార్ట్‌మెంట్ విచారణలో తేలింది. బిల్డింగ్‌ మొత్తం దట్టంగా పొట కమ్మేయడానికి ఇదే కారణమంది ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌. ఫైర్‌ పరికరాలు పనిచేయకపోవడం, భవనం మొత్తం క్లోజ్డ్‌ సర్క్యూట్‌లో ఉండడం, ఒకే ఎగ్జిట్‌ గేటు ఉండడమే ప్రాణనష్టానికి కారణంగా నివేదికలో స్పష్టం చేసింది. భవనానికి ఒకే ఎంట్రీ, ఎగ్జిట్‌ ఒకటే ఉందని..నిబంధనలకు వ్యతిరేకంగా లిఫ్ట్‌ పక్కన మెట్లు పెట్టారని రిపోర్టులో తెలిపింది. అగ్నిప్రమాదం వెనుక భవనం, హోటల్‌ యజమాని నిర్లక్ష్యం ఉందని వివరించింది. పొగ కనిపించిన 12 సెకండ్లలోనే పేలుడు సంభవించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ద్వారా అధికారులు అంచనా వేశారు. రూబీ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో తొమ్మిది మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి కండీషన్‌ సీరియస్‌గా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం 

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ