Amit Shah – Prabhas: బాహుబలి ప్రభాస్‌తో భేటీ కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..

మునుగోడు పర్యటన సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన అమిత్ షా.. జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రానికి వస్తున్న అమిత్ షా.. ప్రభాస్‌తో ప్రత్యేకంగా భేటీ కానుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Amit Shah - Prabhas: బాహుబలి ప్రభాస్‌తో భేటీ కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
Amit Shah To Meet Prabhas
Follow us

|

Updated on: Sep 14, 2022 | 4:44 PM

Amit Shah to Meet Prabhas: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఫామ్ హౌస్‌లో ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. కృష్ణంరాజు నటవారసుడు ప్రభాస్‌ను అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. కృష్ణంరాజు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణించారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రంమంత్రిగా పనిచేశారు. పలువురు బీజేపీ అగ్రనేతలతో కృష్ణంరాజుకు సాన్నిహిత్యం ఉంది. సహాయ మంత్రి హోదాలో ఆయన రక్షణ మంత్రిత్వశాఖలోను పని చేశారు. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేతలు కృష్ణంరాజు కుటుంబసభ్యులను, హీరో ప్రభాస్‌ను పరామర్శించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హీరో ప్రభాస్‌తో భేటీ కానున్నారు. దీంతోపాటు రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు హోంమంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఈనెల 16న హైదరాబాద్‌కు వస్తున్నారు. ముందుగా కృష్ణంరాజు కుటుంబసభ్యులను కలిసి పరామర్శించిన అనంతరం అదే రోజు సాయంత్రం హీరో ప్రభాస్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అంతకుముందు మునుగోడు పర్యటన సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన అమిత్ షా.. జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రానికి వస్తున్న అమిత్ షా.. ప్రభాస్‌తో ప్రత్యేకంగా భేటీ కానుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, 1998లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున తొలిసారి ఏంపీగా గెలిచారు. ఆ తర్వాత 1999లో నర్సాపూర్ నుంచి విజయం సాధించారు. 1999-2004 మధ్య కాలంలో కేంద్రంలో మంత్రి పదవులు నిర్వహించారు. మధ్యలో ప్రజారాజ్యం పార్టీలో కొన్నాళ్ళు పనిచేసినా.. 2014 నుంచి తిరిగి బీజేపీ నేతలతో సన్నిహితంగా వుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే కృష్ణంరాజుకు గవర్నర్ పదవి దక్కవచ్చని ప్రచారం జరిగింది. చివరికి ఆ పదవి దక్కకుండానే ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.