Viral: గంజాయి తనిఖీల నిమిత్తం బస్సును ఆపిన పోలీసులు.. ఓ ప్రయాణికుడి బ్యాగ్ ఓపెన్ చేసి షాక్

గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు చాలా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ ఎత్తున క్యాష్ కూడా పట్టుబడుతుంది.

Viral: గంజాయి తనిఖీల నిమిత్తం బస్సును ఆపిన పోలీసులు.. ఓ ప్రయాణికుడి బ్యాగ్ ఓపెన్ చేసి షాక్
Police Checkings (Representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 14, 2022 | 1:41 PM

గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు పోలీసులు జాతీయ రహదారులపై ప్రత్యేక చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి వాహనాలను విసృతంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే  తాజాగా గంజాయి కోసం సోదాలు చేస్తుండగా.. ఓ బస్సులోని ప్రయాణికుడి వద్ద భారీగా నగదు లభ్యమైంది. మంగళవారం బెర్హంపూర్ నుంచి కటక్‌కు వెళ్తన్న బస్‌లోని ఓ ప్రయాణికుడి నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులు రూ.33 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. లంజిపల్లి వద్ద పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పుడు.. ప్రయాణికుడి బ్యాగ్‌లో భారీగా క్యాష్ కనిపించింది. ఆ నగదుకు సంబంధించి అతడు స్పష్టమైన సమాధానం చెప్పలేదు. కాసేపు తాను బంగారం వ్యాపారినన్నాడు. మరికాసేపు.. జీడిపప్పు వ్యాపారి నంటూ చెప్పుకొచ్చాడు. నగదుకు సంబంధించి ఎటువంటి రిసిప్ట్‌లు, ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు అధికారులు.

“దసరాకు ముందు గంజాయి స్మగ్లింగ్ పెరుగుతుందని మాకు సమాచారం ఉంది. అందుకే రోడ్లను బ్లాక్ చేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఓ బస్సును తనిఖీ చేస్తున్నప్పుడు ఒక ప్రయాణీకుడి నుండి భారీ మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నాము. దీనిపై ఎక్సైజ్ కమిషనర్‌కు సమాచారం అందించాము. నిందితుడ్ని, స్వాధీనం చేసుకున్న డబ్బును తదుపరి దర్యాప్తు నిమిత్తం బైద్యనాథ్‌పూర్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జికి అప్పగించాము. విచారణలో అసలు నిజం తెలుస్తుంది” అని ఎక్సైజ్ ఐఐసి, హృదయ చంద్ర సమంత తెలిపారు.  గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టడంలో భాగంగా  గంజాం మీదుగా వెళ్లే ప్రతి వాహనాన్ని ఎక్సైజ్ శాఖ తనిఖీ చేస్తుంది.

Cash

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
IPL Mega Auction 2025 Live: తొలి బిడ్డింగ్ అర్షదీప్ సింగ్‌పైనే
IPL Mega Auction 2025 Live: తొలి బిడ్డింగ్ అర్షదీప్ సింగ్‌పైనే