Gujarat: గుజరాత్‌ తీరంలో పాకిస్తాన్ బోట్‌‌.. రూ.200 కోట్ల హెరాయిన్‌ సీజ్, ఆరుగురు అరెస్ట్..

పడవలో రూ. 200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ ఎటిఎస్ అధికారి తెలిపారు. దీంతోపాటు పడవలోని ఆరుగురు పాకిస్థానీ సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

Gujarat: గుజరాత్‌ తీరంలో పాకిస్తాన్ బోట్‌‌.. రూ.200 కోట్ల హెరాయిన్‌ సీజ్, ఆరుగురు అరెస్ట్..
Drugs
Follow us

|

Updated on: Sep 14, 2022 | 3:06 PM

Pakistani boat carrying drugs: గుజరాత్‌ సముద్ర తీరంలో మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్‌ సంయుక్త ఆపరేషన్‌లో బుధవారం గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో పాకిస్తాన్ ఫిషింగ్ బోట్‌ను అడ్డుకున్నారు. పడవలో రూ. 200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ ఎటిఎస్ అధికారి తెలిపారు. దీంతోపాటు పడవలోని ఆరుగురు పాకిస్థానీ సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కచ్ జిల్లాలోని జాఖౌ నౌకాశ్రయానికి సమీపంలో కోస్ట్ గార్డ్, ఏటీఎస్ సంయుక్త బృందం సముద్రం మధ్యలో డ్రగ్స్‌తో వెళ్తున్న ఫిషింగ్ బోట్‌ను అడ్డగించిందని అధికారి తెలిపారు. సముంద్రంలో చేపలు పట్టే పడవలో హెరాయిన్‌ను తరలిస్తున్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు.

హెరాయిన్‌ను సముద్ర మార్గం ద్వారా గుజరాత్ తీసుకువచ్చి.. ఆ తర్వాత రోడ్డు మార్గంలో పంజాబ్‌కు రవాణా చేయడానికి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం ఆధారంగా పాకిస్తాన్ బోటును అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న పడవను సీజ్ చేశామని.. సిబ్బందిని విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. ATS, కోస్ట్ గార్డ్ గతంలో కూడా ఇటువంటి మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ప్రయత్నాలను విఫలం చేశాయి. గుజరాత్ తీరం మీదుగా భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్న మాదక ద్రవ్యాలతోపాటు విదేశీ పౌరులను కూడా పట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి