BEL Recruitment 2022: బీటెక్ ఫ్రెషర్స్‌కు సదావకాశం! భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మహారాష్ట్రలోని పూణెలోనున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL Pune).. 7 ట్రైనీ ఇంజినీర్-1 (Trainee Engineer-I Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
BEL Pune Trainee Engineer-I Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మహారాష్ట్రలోని పూణెలోనున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL Pune).. 7 ట్రైనీ ఇంజినీర్-1 (Trainee Engineer-I Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రానిక్స్/మెకానికల్/సివిల్ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, బీఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే దరఖాస్తుదారుల వయసు సెప్టెంబర్ 1, 2022వ తేదీ నాటికి 28 యేళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 29, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.177లు అప్లికేషన్ ఫీజు తప్పనినసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరచిన వారికి మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది నెలకు రూ.35,000, మూడో ఏడాది నెలకు రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిపికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: Sr. Dy. General Manager Dy. General Manager (HR&A), Bharat Electronics Limited, N.D.A.Road, Pashan, Pune- han, Pune-411021 Maharashtra.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.