AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

viral video: పెళ్లి విందులో అప్పడం లొల్లి! నవ్వులు పూయిస్తున్న ఆనంద్ మహీంద్రా వీడియో..

పెళ్లిళ్లలో మగ పెళ్లివారికి మర్యాదలు చేయడంలో ఏ మాత్రం అటు ఇటు అయినా మూడో ప్రపంచ యుద్ధం వచ్చినంత పనవుతుంది. ఐతే ఇటీవల జరిగిన ఓ పెళ్లి విందులో అప్పడం వడ్డించ లేదని మగ పెళ్లివారు లక్షన్నర రూపాయల ఫర్నీచర్‌ విరుగగొట్టారు. దీనికి..

viral video: పెళ్లి విందులో అప్పడం లొల్లి! నవ్వులు పూయిస్తున్న ఆనంద్ మహీంద్రా వీడియో..
Fight Over Pappadams
Srilakshmi C
|

Updated on: Sep 13, 2022 | 9:08 PM

Share

Fight over pappadams: పెళ్లిళ్లలో మగ పెళ్లివారికి మర్యాదలు చేయడంలో ఏ మాత్రం అటు ఇటు అయినా మూడో ప్రపంచ యుద్ధం వచ్చినంత పనవుతుంది. ఐతే ఇటీవల జరిగిన ఓ పెళ్లి విందులో అప్పడం వడ్డించ లేదని మగ పెళ్లివారు లక్షన్నర రూపాయల ఫర్నీచర్‌ విరుగగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. ఈ అప్పడం లొల్లి వైపు మీరు ఓ లుక్కేసుకోండి..

కేరళలో జరిగిన ఓ పెళ్లి విందులో వియ్యంకుల వారికి బంతిలో కూర్చోబెట్టి పప్పన్నం వడ్డించారు ఆడపెళ్లివారు. వరుడి ఫ్రెండ్స్‌కు విందులో వడ్డించిన అప్పడం తెగ నచ్చేసింది. దీంతో రెండో సారి అప్పడం వడ్డించవల్సిందిగా హుకుం జారీ చేశారు. ఐతే ఆడపెళ్లివారు అందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహానికి గురైన మగ పెళ్లివారు ఆడ పెళ్లివారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అదికాస్తా శ్రుతిమించి కొట్లాటకు దిగారు. దీంతో అతిధుల కోసం వేసిన కుర్చీలు, ఇతన సామాగ్రిని తుక్కుతుక్కుగా విరగగొట్టారు. అప్పడం కోసం జరిగిన ఈ పోరాటంలో దాదాపు రూ.1.5 లక్షల నష్టం వాటిల్లింది.

ఇవి కూడా చదవండి

ఈ ఘర్షనలో తీవ్ర గాయాలపాలయిన ఆడిటోరియం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పడం కోసం జరిగిన ఈ పోరాటానికి ఓ సరికొత్త పేరును సూచించవల్సిందిగా ఆనంద్ మహీంద్రా కోరారు. ‘లంచ్ రిసెప్షన్‌లలో రెండోసారి, మూడోసారి కూడా అప్పడాలు వడ్డించకపోవడం తీవ్రమైన నేరం. దీని కోసం తీవ్రంగా పోరాడాలి’ అని ఒకరు, ‘నాకు కనీసం నాలుగైనా వడ్డించాల్సిందేనని’ మరొకరు సరదాగా కామెంట్‌ సెక్షన్‌లో స్పందించారు. మీరేమంటారు..