Second Marriage: హిజ్రా ప్రేమలో మునిగిన భర్త.. రెండో పెళ్లి చేసిన భార్య! ఎక్కడ జరిగిందంటే..

కుటుంబంలో భార్య, భర్తల మధ్య విబేధాలు తలెత్తడానికి ప్రధాన కారణం వివాహేతర సంబంధాలు. వీరిరువురిలో ఎవరు తప్ప(ప్పు)టడుగు వేసినా కాపురం అల్లకల్లోలం అవుతుంది. ఐతే ఇందుకు విరుద్ధంగా ఓ భార్య తన భర్త వేరే మహిళను ప్రేమించాడని తెలుసుకుని ఏకంగా..

Second Marriage: హిజ్రా ప్రేమలో మునిగిన భర్త.. రెండో పెళ్లి చేసిన భార్య! ఎక్కడ జరిగిందంటే..
Transwoman Marriage
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 13, 2022 | 6:58 PM

Man married transwoman with wife consent: కుటుంబంలో భార్య, భర్తల మధ్య విబేధాలు తలెత్తడానికి ప్రధాన కారణం వివాహేతర సంబంధాలు. వీరిరువురిలో ఎవరు తప్ప(ప్పు)టడుగు వేసినా కాపురం అల్లకల్లోలం అవుతుంది. ఐతే ఇందుకు విరుద్ధంగా ఓ భార్య తన భర్త వేరే మహిళను ప్రేమించాడని తెలుసుకుని ఏకంగా పెళ్లి చేసింది. సినిమాను తలపించేలా ఉన్నా ఇది నిజంగా జరిగిన సంఘటన. వివరాల్లోకెళ్తే..

ఒరిస్సా రాష్ట్రంలోని కలహండి జిల్లా పరిధిలోని డోర్‌కుట్‌ గ్రామంలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన ఫకీర్‌ నియాల్‌ (32)కు అయిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఫకీర్‌ నియాల్‌ ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన సంగీత అనే హిజ్రాతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య, భర్తతో గొడవపడకుండా ఆ హిజ్రాతో మాట్లాడి తన భర్తతో సెప్టెంబర్‌ 11న గుడిలో సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం చట్టరిత్యా నేరం. ఐతే మొదటి భార్య అనుమతితో ఈ వివాహం జరగడం వల్ల.. ఈ పెళ్లికి సంబంధించి ఎవరి వైపు నుంచైనా అభ్యంతరాలు తలెత్తితే చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు చెబుతున్నారు. చట్ట రిత్యా ఈ వివాహం అంగీకరించబడదని, దీనిని లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌గా పరిగణించబడుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఆదివారం జరిగిన ఈ పెళ్లికి ట్రాన్స్‌జెండర్లు అనేక మంది హాజరయ్యారు. ఒంటరైన తాను ఫకీరును ప్రేమించినందుకు, ఆయన భార్య కొత్త జీవితం ప్రసాదించిందని, తనకు ఇప్పుడు ఓ కుటుంబం ఉందనే ఆనందం వ్యక్తం చేసింది హిజ్రా మహిళ.

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?