AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పేదల గురించి ఆలోచించింది ఆ ఇద్దరే.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణలో టిఆర్ ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తన ప్రజాసంగ్రామ యాత్రలో సీఏం కేసీఆర్, టీఆర్ ఎస్ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు చేస్తుంటే.. టీఆర్ మంత్రులు..

Telangana: పేదల గురించి ఆలోచించింది ఆ ఇద్దరే.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు..
Minister Errabelly Dayakar
Amarnadh Daneti
|

Updated on: Sep 14, 2022 | 5:01 PM

Share

Telangana: తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజల కోసం ఆలోచించింది ఇద్దరే ఇద్దరు నాయకులని ఒకరు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాగా.. మరొకరు కేసీఆర్ అని పేర్కొన్నారు.  కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈవ్యాఖ్యలు చేశారు.  పేద ప్రజల సంకేమం కోసం ఆలోచించే ఆ ఇద్దరు నాయకులంటే తనకు ఇష్టమని చెప్పారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యకులు బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సామాజిక పెన్షన్ ఎంత ఇస్తున్నారో బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఆరు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని, పైగా మోటార్లకు మీటర్లు పెడుతున్నారన్నారు. ఒక్కొక్క మోటార్ కు లక్ష రూపాయలు విద్యుత్తు బిల్లు వస్తుంది మీటర్లు పెడదామా అంటూ ప్రశ్నలు సంధించారు. బీజేపీ నాయకులు దుర్మార్గులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి ఎరబ్రెల్లి దయాకర్ రావు. తెలంగాణలో చేస్తున్న పాదయాత్ర దమ్ముంటే కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లో చేద్దాం రావాలంటూ సవాలు విసిరారు. ప్రజలందరి సంక్షేమాన్ని కాంక్షించే పాలన తెలంగాణలో అందిస్తుంటే ఇక పాదయాత్రలు ఎందుకు చేస్తున్నట్లె అర్థంకావడం లేదన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, ఆపార్టీ వల్లే దేశం నాశనం అవుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రావల్సిన నిధులను కేంద్రప్రభుత్వం ఇవ్వడంలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..