Urine Infection: తెల్లవారుజామున మూత్రం పసుపు రంగులో వస్తుందా..? అలా అయితే, అస్సలు ఆలస్యం చేయకండి..
పసుపు రంగు మూత్రం వెనుక కొన్ని ఇతర సమస్యలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు
Urine Infection: ఒక వ్యక్తి శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు మూత్రం పసుపు రంగులో వస్తుంది. డీహైడ్రేషన్ సమస్య లక్షణాలలో ఇది ఒకటి. అయితే ఇది కాకుండా పసుపు రంగు మూత్రం వెనుక కొన్ని ఇతర సమస్యలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. ఉదయం నిద్రలేవగానే మూత్రం పసుపు రంగులో వస్తే దాని వెనుక (yellow urine causes) గల కారణాలు ఏమిటి..? దీనిని ఎలా నివారించవచ్చు..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..
ఉదయం వేళ మూత్రం పసుపు రంగులో రావడానికి గల కారణాలు..
ఒక వ్యక్తి తన శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు మూత్రం పసుపు రంగులో వస్తుంది.
కిడ్నీలో రాయి ఉన్నప్పుడు ఉదయం వేళ మూత్రం పసుపు రంగులో వస్తుంది. అటువంటి పరిస్థితిలో మూత్రం రంగు మారడంతో పాటు జననాంగంలో నొప్పి, మంట కూడా సంభవించవచ్చు.
గర్భిణీ స్త్రీలకు కూడా తెల్లవారుజామున మూత్రం పసుపు రంగులో వచ్చే సమస్య ఉంటుంది.
ప్రేగులకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు మూత్రం పసుపు రంగులో వస్తుంది. ఈ సందర్భంలో వెంటనే వైద్యుడిని సంప్రదించవలసిన అవసరం ఉంది.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చికిత్సలో ఉపయోగించే కొన్ని ఔషధాలను ఒక వ్యక్తి తీసుకున్నప్పుడు, ఆ వ్యక్తి మూత్రం రంగు మారుతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత అలాంటి వారి మూత్రం పసుపు రంగులో కనిపిస్తుంది.
మూత్రం పసుపురంగులో కనిపిస్తే ఈ పద్దతులను అనుసరించండి..
- నీరు పుష్కలంగా తాగాలి.
- ఆహారంలో విటమిన్ సి చేర్చుకోండి.
- ఆహారంలో నిమ్మకాయను చేర్చుకోండి.
- జామకాయ తినండి.
- పెరుగు తినండి.
- గ్రీన్ టీ కూడా తీసుకోండి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..