AP Crime News: భర్త ఒకచోట.. భార్య మరోచోట.. మధ్యలో ఎంటరైన ప్రియుడు.. సీన్ కట్ చేస్తే..

కృష్ణాజిల్లా గుడివాడ బాపూజీ నగర్‌లో ఉంటున్న అనూషకు ఇదివరకే పెళ్లయింది. ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు. భర్త రాజమండ్రిలో ఉంటుండగా, పెద్దకొడుకు తిరుపతిలో ఉంటాడు.

AP Crime News: భర్త ఒకచోట.. భార్య మరోచోట.. మధ్యలో ఎంటరైన ప్రియుడు.. సీన్ కట్ చేస్తే..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 14, 2022 | 3:48 PM

Gudivada News: ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి.. భర్త ఒకచోట, పిల్లలు మరొక చోట ఉంటున్నారు.. ఈ ఏకాంతం మరొక పరిచయానికి దారి తీసింది..? ఆ దారే ఇప్పుడు ఆమె ప్రాణాలమీదకు తెచ్చింది. కృష్ణాజిల్లా గుడివాడలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కృష్ణాజిల్లా గుడివాడ బాపూజీ నగర్‌లో ఉంటున్న అనూషకు ఇదివరకే పెళ్లయింది. ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు. భర్త రాజమండ్రిలో ఉంటుండగా, పెద్దకొడుకు తిరుపతిలో ఉంటాడు. ఇదే సందర్భంలో ఆమెకు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇంటికి వస్తూ పోతుండేవాడు. ఈ సమయంలో అనుమానాస్పద స్థితిలో జరిగిన ప్రమాదంలో అనూషకు తీవ్ర గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదంలో అనూష తీవ్రంగా గాయపడింది. గాయపడిన అనుషను స్థానికులు ప్రైవేటు ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అనూష పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

అయితే.. ఈ ప్రమాదం వెనుక ఏం జరిగింది..? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రియుడు మచ్చ వెంకటేశ్వరరావు అనూషను చంపేందుకు ప్రయత్నించి అగ్ని ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని బంధువులు, కొడుకులు ఆరోపిస్తున్నారు. విషయం బయటకు చెబితే కొడుకులను చంపేస్తానని చెప్పడంతో బయపడి తన తల్లి.. వేరేలా చెబుతోందని ఆమె కొడుకులు పేర్కొంటున్నారు.

అయితే, బంధువుల ఆరోపణ అలా ఉంటే.. తనకు తానుగానే పెంపుడు కుక్కకు గోమర్లను ఓ డబ్బాలో వేసి తగులబెట్టే క్రమంలో ప్రమాదం జరిగినట్లు మెజిస్ట్రేట్ ముందు అనూష వాంగ్మూలం ఇచ్చింది. వెంకటేశ్వరరావు తమను చంపేస్తామని బెదిరించడంతో భయపడిన తమ తల్లి అనూష మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిందని, వాస్తవానికి వెంకటేశ్వరరావు తన తల్లిని చంపేందుకు ప్రయత్నించడాని అనూష కుమారులు వర్ధన్, జగన్ పేర్కొంటున్నారు. తమకు ప్రాణరక్షణ కల్పించాలంటూ వేడుకుంటున్నారు. అనూష ఇచ్చిన వాంగ్మూలం మేరకు సీఐ దుర్గారావు దర్యాప్తు చేపట్టారు. కొడుకులు చేస్తున్న ఆరోపణలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..