Andhra Pradesh: లాడ్జీలో వ్యక్తి దారుణ హత్య.. ఆ వ్యవహారమే కారణమని భావిస్తున్న పోలీసులు..
చిత్తూరులో (Chittoor) దారుణం జరిగింది. పట్టణంలోని ఓ లాడ్జీలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మహిళతో కలిసి రూమ్ తీసుకున్న వ్యక్తి విగత జీవిగా మారడం కలకలం సృష్టించింది. ఇద్దరి మధ్య చెలరేగిన వివాదంతో మహిళ...
చిత్తూరులో (Chittoor) దారుణం జరిగింది. పట్టణంలోని ఓ లాడ్జీలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మహిళతో కలిసి రూమ్ తీసుకున్న వ్యక్తి విగత జీవిగా మారడం కలకలం సృష్టించింది. ఇద్దరి మధ్య చెలరేగిన వివాదంతో మహిళ అతనిని దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతానికి చెందిన ఈశ్వరయ్య పదేళ్ల క్రింత చిత్తూరుకు వచ్చాడు. స్వగ్రామంలో పనులు లేకపోవడంతో చిత్తూరు వచ్చి చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ నివాసముంటున్నాడు. అతనికి యాదమరి మండలం అత్తగారిపల్లి గ్రామానికి చెందిన లలితతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం సన్నిహిత సంబంధానికి దారి తీసింది.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఈశ్వరయ్య, లలితలు చిత్తూరులోని ఓ లాడ్జిలో గది అద్దెకి తీసుకున్నారు. ఇద్దరి మధ్య డబ్బు విషయంలో ఘర్షణ జరిగింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తురాలైన లలిత ఈశ్వరయ్యను దారుణంగా హత్య చేసింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. విషయం తెలుసుకున్న లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న చిత్తూరు పోలీసలు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..