Viral Video: బైక్ రైడర్ కు హెల్మెట్ పెడుతూ.. ప్రత్యేకమైన మంత్రాన్ని పఠించిన పోలీసు.. నెట్టింట్లో వీడియో వైరల్
ఈ వీడియోలో.. ఒక పోలీసు హెల్మెట్ పెడుతూ ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని వినిపించాడు. అంతేకాదు హెల్మెట్ ఎందుకు ధరించాలో చెబుతున్నాడు. బైక్ నడిపే వ్యక్తికి పోలీస్ అధికారి హెల్మెట్ పెడుతూ..
Viral Video: రోడ్డుమీద ప్రమాదాలను నివారించడానికి వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎంతమంది చెప్పినా వాటిని పెట్టుకునేవారు తక్కువమంది ఉన్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు, దానిపై ప్రయాణించే వారికి హెల్మెట్ చాలా ముఖ్యం. ఈ హెల్మెట్ వాహనదారులను ప్రమాదాలను నుంచి రక్షించే ఒక రక్షణ కవచం. ఎప్పుడైనా అనుకోని విధంగా రోడ్డు ప్రమాదం సంభవిస్తే.. ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది . అయితే ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఇప్పటికీ హెల్మెట్ ధరించని వారు దేశంలో చాలా మంది ఉన్నారు. అటువంటి పరిస్థితిలో వాహనదారులకు చలానా విధిస్తారు. అదే సమయంలో పోలీసులు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రజలకు వివరిస్తున్నారు, అయితే కొంతమంది పోలీసులు కూడా ప్రజలకు హెల్మెట్ ధరించమని ప్రత్యేకంగా బోధిస్తారు. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది చాలా ఫన్నీగా ఉంది.
వాస్తవానికి, ఈ వీడియోలో.. ఒక పోలీసు హెల్మెట్ పెడుతూ ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని వినిపించాడు. అంతేకాదు హెల్మెట్ ఎందుకు ధరించాలో చెబుతున్నాడు. బైక్ నడిపే వ్యక్తికి పోలీస్ అధికారి హెల్మెట్ పెడుతూ.. బైక్ నడుతుపున్న వ్యక్తితో మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. పోలీసు అధికారి చెబుతున్న మంత్రం విని బైక్ రైడర్ భార్య నవ్వుతుంది. అంతేకాదు.. పోలీసు అధికారి మరోసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే చలానా విధిస్తామని హెచ్చరించారు. దీంతో బైక్ రైడర్.. ఇక నుంచి ఎప్పుడూ హెల్మెట్ లేకుండా ఎక్కడికీ వెళ్లనని చెప్పాడు.
इस भाई को इतनी इज़्ज़त से तो शादी में सेहरा भी नहीं पहनाया गया होगा? pic.twitter.com/UQn1gRFypz
— Jaiky Yadav (@JaikyYadav16) September 9, 2022
ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @JaikyYadav16 పేరుతో షేర్ చేయబడింది. 37 సెకన్ల నిడివి గల ఈ వీడియో ఇప్పటి వరకు 1 లక్షా 91 వేలకు పైగా వీక్షించగా, 9 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి రకరకాల రియాక్షన్స్ ఇచ్చారు. ఒక వినియోగదారు తన శైలి ఎల్లప్పుడూ విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుందని కామెంట్ చేశారు. ‘పండిట్ జీ పేరు ఏమిటి? కీర్తన చాలా బాగా చేస్తున్నారని కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..