Mother and son: 8 ఏళ్ల అనంతరం తల్లిని కలిసిన క్షణం.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో..
అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే అమ్మను కనిపించే దైవం అంటారు. ప్రతి తల్లి తన పిల్లలే సర్వస్వం అని బతుకుతుంది. వాళ్ల ఎదుగుదల గురించే నిరంతరం ఆలోచిస్తుంది.
అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే అమ్మను కనిపించే దైవం అంటారు. ప్రతి తల్లి తన పిల్లలే సర్వస్వం అని బతుకుతుంది. వాళ్ల ఎదుగుదల గురించే నిరంతరం ఆలోచిస్తుంది. అమ్మ ప్రేమ అనంతం. చదువులు, ఉద్యోగాల కోసం పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. తల్లులు మనసులో అల్లాడిపోతారు. రోజుకు 2,3 సార్లు ఫోన్లు చేసి మరీ బాగోగులు కనుక్కుంటారు. చేసిన ప్రతిసారి అమ్మ.. బిడ్డను అడిగే మొదటి మాట తిన్నావా అని. కొంతమంది పిల్లలు కూడా తమ పేరెంట్స్‌పై అంతే ప్రేమను కలిగి ఉంటారు. తాజాగా ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో 8 ఏళ్లు దూరంగా ఉన్న అనంతరం కొడుకు తన తల్లిని కలుసుకున్నాడు. ఈ వీడియో నెటిజన్లను బావోద్వేగానికి గురి చేస్తుంది. ఒక్కసారిగా తన తల్లిని చూడగానే ఒకింత ఆశ్చర్యానికి గురై… తల్లిని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మదర్ కూడా ఎమోషన్‌కు లోనై ఏడ్చేసింది. ఆపై తల్లి నుదిటిపై ఏడుస్తూనే ముద్దు పెట్టాడు కొడుకు. ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్ల హృదయాలను హత్తుకుంటుంది. చాలామంది తమ మదర్స్‌తో ఉన్న బాండింగ్ గురించి కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

