Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
ఆ యువకుడు అందరూ నిద్రపోయాక యాక్టివ్ అవుతాడు. అర్ధరాత్రి తీరిగ్గా దొంగతనానికి బయలుదేరుతాడు. వీలైతే డైరెక్టుగా గేటు ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తాడు.. లేదంటే పైకప్పునుంచే ఇళ్లలోకి ప్రవేశిస్తాడు.
ఆ యువకుడు అందరూ నిద్రపోయాక యాక్టివ్ అవుతాడు. అర్ధరాత్రి తీరిగ్గా దొంగతనానికి బయలుదేరుతాడు. వీలైతే డైరెక్టుగా గేటు ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తాడు.. లేదంటే పైకప్పునుంచే ఇళ్లలోకి ప్రవేశిస్తాడు. ఇంత బాగా ప్లాన్ చేశాడంటే అతను ఏదో భారీ చోరీలు చేస్తుంటాడులే అనుకోవచ్చు. కానీ ఆ యువకుడు దొంగతనం చేసింది తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ అంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ఆకాశ్ అనే యువకుడు వింత చోరీలకు పాల్పడుతున్నాడు. మహిళలు ఉతికి ఆరేసుకున్న లోదుస్తులను దొంగిలిస్తున్నాడు. ఇలా గ్వాలియర్ ప్రాంతంలో చాలా ఇళ్లలో దొంగతనాలు చేశాడు. ఆరేసిన లోదుస్తులు, ఇన్నర్ లు ఏమవుతున్నాయో తెలియక మహిళలు అందరూ అయమయానికి గురయ్యారు. దీనికి తోడు లోదుస్తులు పోయాయని ఫిర్యాదు ఇస్తే బాగుండదని ఎవరూ ముందుకు రాలేదు. అయితే ఇటీవల ఆకాష్ ఎప్పటిలాగే అర్ధరాత్రి దాటిన తర్వాత తలుపులు బార్లా తెరిచి ఉన్న ఓ ఇంటిలోకి వెళ్లాడు. ఆ తర్వాత చాలాసేపటికి చేతిలో మహిళల లోదుస్తులు పట్టుకుని బయటికి వచ్చాడు. ఈ తతంగం అంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో అర్ధరాత్రి ఓ దొంగ తన ఇంట్లోకి ప్రవేశించి తన భార్య లోదుస్తులను దొంగిలించాడని ఓ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యాపారి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సీసీ పుటేజ్ ఆధారంగా నిందితుడిని ఆకాశ్‌ను గుర్తించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

