Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫోన్ లాక్కున్న తల్లి.. ఇంట్లో బీభత్సం సృష్టించిన కొడుకు.. భూకంపం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి రాదేమో..

వైరల్ అవుతున్న వీడియోలో బాలుడు మొబైల్‌కు ఎంతగా అడిక్ట్ అయ్యాడో తెలుస్తుంది. తన తల్లి .. తన చేతి నుంచి మొబైల్‌ని తీసుకోగానే ఇంటిలో  విధ్వంసం సృష్టించాడు.

Viral Video: ఫోన్ లాక్కున్న తల్లి.. ఇంట్లో బీభత్సం సృష్టించిన కొడుకు.. భూకంపం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి రాదేమో..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Sep 16, 2022 | 9:14 PM

Viral Video: ప్రస్తుతం మొబైల్ ఫోన్లకు వయసుతో సంబంధం లేకుండా అడిక్షన్ గా మారుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని చూసినా గంటల తరబడి మొబైల్‌లో మునిగిపోతూ దర్శనమిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో కొన్ని నష్టాలు ఉన్నాయి. ఇది రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేయడమే కాకుండా, శారీరక, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా పిల్లల్లో చిరాకు సమస్య అధికంగా ఉంటుంది. అందుకే పిల్లలు మొబైల్‌కు అలవాటు పడకుండా చూడాలి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూస్తే.. సెల్ ఫోన్ కు అలవాటు పడే పిల్లలను చూస్తే.. మీకు కూడా కోపం వస్తుంది.

వైరల్ అవుతున్న వీడియోలో బాలుడు మొబైల్‌కు ఎంతగా అడిక్ట్ అయ్యాడో తెలుస్తుంది. తన తల్లి .. తన చేతి నుంచి మొబైల్‌ని తీసుకోగానే ఇంటిలో  విధ్వంసం సృష్టించాడు. వస్తువులన్నిటిని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. వంటగది నుండి పడకగది వరకు.. నానా బీభత్సం సృష్టించాడు. ఇదిలా ఉంటే, ప్రపంచంలో మొబైల్‌కు బానిసలైన వారు చాలా మంది ఉన్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే, వారు మొబైల్ అడిక్షన్‌కు గురయ్యారని కూడా వారు గుర్తించలేరు. ఈ వ్యసనానికి గురవుతున్నవారు చిన్నపిల్లలే కాదు.. యువతీ యువకుల నుంచి వృద్ధుల వరకు స్మార్ట్ ఫోన్ కు బానిసగా మారిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

15 ఏళ్ల బాలుడు తన తల్లి తన మొబైల్ ఫోన్‌ను తీసుకువెళ్లినందుకు కోపంతో ఇంట్లో విధ్వంసం సృష్టించాడు. మొబైల్ అడిక్షన్ నుండి తప్పించుకోవడానికి,  భావోద్వేగాలను, చర్యలను నియంత్రించడం నేర్చుకోవడానికి తల్లిదండ్రులు నేటి తరానికి అవగాహన కల్పించడం ఎంత ముఖ్యమో దృశ్యం చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.

వంటగదిలో అన్ని వస్తువులు అక్కడక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయో వీడియోలో చూడవచ్చు. 15 ఏళ్ల బాలుడు సామాన్లు పగలగొట్టడమే కాకుండా బెడ్‌రూమ్‌లోని అల్మారా అద్దాన్ని కూడా పగలగొట్టాడు. అంతే కాకుండా హాల్లోని కిటికీ అద్దాలు ధ్వంసం చేసి, బాత్‌రూమ్, గదిలోని టీవీని కూడా పడేసి పగలగొట్టి నానా బీభత్సం సృష్టించాడు. సెల్ ఫోన్ తీసుకున్నందుకు మొత్తం ఆ బాలుడు తన ఇంట్లో వేల రూపాయల నష్టాన్ని కలిగించాడు. మొబైల్ అడిక్షన్ కు గురైన పిల్లలకు ఏ స్టేజ్ కు చేరుకుంటున్నారో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది.

ఈ వీడియోను ఐపిఎస్ అధికారి దీపాంషు కబ్రా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఇంట్లో జరిగిన ఈ విధ్వంసం 15 ఏళ్ల పిల్లవాడి వల్ల జరిగింది, ఎందుకంటే బాలుడి తల్లి అతని మొబైల్ ఫోన్ తీసుకున్నందున ఇది జరిగింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..