Viral Video: తినేటప్పుడు విసిగించాడని ఫోటోగ్రాఫర్‌కు సుస్సు పోయించిన సింహం..
సోషల్ మీడియా అనేది ఓ అంతులేని ప్రపంచం. నిత్యం ఎన్నో రకాల వీడియోలు, వైరల్ న్యూస్ లతో నిండిపోయి ఉంటుంది. ఇక సోషల్ మీడియా అనేది చేతికొచ్చిన తర్వాత మన ప్రపంచం..
Viral Video: సోషల్ మీడియా అనేది ఓ అంతులేని ప్రపంచం. నిత్యం ఎన్నో రకాల వీడియోలు, వైరల్ న్యూస్ లతో నిండిపోయి ఉంటుంది. ఇక సోషల్ మీడియా అనేది చేతికొచ్చిన తర్వాత మన ప్రపంచం మరింత చిన్నదైపోయింది. ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా అది క్షణాల్లో మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ,లో ప్రత్యక్షం అవుతున్నాయి. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియోల్లో ఎక్కువ శాతం జంతువులకు సంబంధించినవే.. తాజాగా ఓ సింహానికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. సింహాలు వాటి ఆవాసాలపై ఆధిపత్యం చెలాయించే సామర్థ్యం కారణంగా వాటిని అడవికి రాజులు అని పిలుస్తుంటారు. సింహం వేటాడితే తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. తాజాగా ఓ సింహం చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఫేస్‌బుక్ ఖాతా రోరింగ్ ఎర్త్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది దక్షిణాఫ్రికాలోని ప్లెటెన్‌బర్గ్ అనే నగరంలో తీసిన వీడియో. ఈ వీడియోలో, మగ సింహం తాను వేటాడిన అడవి దున్నను తింటోంది. ఇంతలో ఫోటోగ్రాఫర్ ఆ దృశ్యాలను తీయడానికి ప్రయత్నించాడు. ఇది చూసిన సింహం ఫోటోగ్రాఫర్ వైపు దూసుకొచ్చింది. అయితే ఫోటోగ్రాఫర్ విద్యుత్ కంచె అవతల ఉండటంతో సింహం దాడి చేయలేక తిరిగి వెళ్లిపోయింది. ఈ వీడియోను ఇప్పటికే 1.5 మిలియన్ల మంది వీక్షించారు. నిజంగా ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే.. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి. \
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..