New OTT releases: మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారంలో ఓటీటీలలోకి బోలెడంత కంటెంట్.. ఇదిగో లిస్ట్..

ఈ వారం ఓటీటీలలో చాలా సినిమాలు, వెబ్ సిరిస్‌లు సందడి చేస్తున్నాయి. ఏయే యూవీస్/సిరీస్‌లు ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతున్నాయో వివరాలు మీకోసం.

New OTT releases: మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారంలో ఓటీటీలలోకి బోలెడంత కంటెంట్.. ఇదిగో లిస్ట్..
Latest OTT releases
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 16, 2022 | 1:19 PM

OTT releases this week: కోవిడ్ సయమంలో జనాలు ఓటీటీలలో విపరీతంగా మూవీస్ చూసేశారు. వరల్డ్‌లోని అన్ని భాషల్లోని సినిమాలను ఓ పట్టు పట్టేశారు. సినిమా పరంగా జనాలు అప్‌డేట్ అయ్యారన్నది వాస్తవం. ఈ క్రమంలోనే యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలను అస్సలు ఎంకరేజ్ చెయ్యడం లేదు ఆడియెన్స్. అదే కాస్త హిట్ టాక్ వచ్చినా చాలు థియేటర్లకి వెళ్తున్నారు. ఇక మిస్ అయిన సినిమాలు ఏవైనా ఉంటే.. వాటిని ఓటీటీలలో కంపల్సరీగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఈవారం విడుదల కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాం.

  • రామారావు ఆన్ డ్యూటీ

రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ ఎర్రచందనం మాఫియాపై పోరాడే నిజాయితీ గల ప్రభుత్వ అధికారి కథ. 1995 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్,  వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రల్లో నటించారు.

OTT ప్లాట్‌ఫారమ్ : SonyLIV విడుదల తేదీ  – సెప్టెంబర్ 15, 2022 దర్శకత్వం : శరత్ మండవ భాష : తెలుగు

  • మోసగాళ్లు

విష్ణు మంచు పాన్ ఇండియన్ తొలి చిత్రం మోసగాళ్లు గతేడాది విడుదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా రూపొందిన ఈ టెక్ థ్రిల్లర్‌లో స్టార్ నటి కాజల్ అగర్వాల్ విష్ణు సోదరిగా నటించింది. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ప్రజంట్ స్ట్రీమ్ అవ్వుతుంది. ఈ శుక్ర‌వారం నుంచి ఆహాలో కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  • విక్రాంత్ రోణ

సుదీప్ హీరోగా వచ్చిన ‘విక్రాంత్ రోణ’ సెప్టెంబర్ 16 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

  • కిరోసిన్

‘బిగ్ హిట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ధృవ మెయిన్ లీడ్‌లో దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ మూవీకి ధృవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 16 నుండీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

  • జోగి 

1984 సిక్కు-వ్యతిరేక ఊచకోత నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. దిల్జిత్ దోసాంజ్ నటించిన జోగి శుక్రవారం ఓటీటీలో అడుగుపెట్టింది. అక్టోబరు 31, 1984న మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు హత్య చేసిన తర్వాత ఢిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగిన సమయంలోని పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఆ సమయంలో భారతదేశం అంతటా 3,000 మంది సిక్కులు చంపబడ్డారు. ఢిల్లీలో ఎక్కువ మంది చనిపోయారు.

OTT ప్లాట్‌ఫారమ్ : నెట్‌ఫ్లిక్స్

విడుదల తేదీ  – సెప్టెంబర్ 16, 2022 దర్శకత్వం : అలీ అబ్బాస్ జాఫర్ భాష : హిందీ

  • దహన్ 

దహన్ అనేది  పురాతన మూఢనమ్మకాలపై పోరాడే ఒక మిషన్‌‌ను వివరించే స్టోరీ. టీసా చోప్రా ప్రధాన పాత్రలో నటించారు.

OTT ప్లాట్‌ఫారమ్ : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విడుదల తేదీ  – సెప్టెంబర్ 16, 2022 దర్శకత్వం : విక్రాంత్ పవార్ భాష : హిందీ

  • జానీ vs అంబర్: ది US ట్రయల్

హాలీవుడ్ ఫేమస్ యాక్టర్ జానీ డెప్ పరువు నష్టం కేసులో తన మాజీ భార్య అంబర్ హెర్డ్ మీద విన్ అయ్యారు. జానీ డెప్‌ పరువుప్రతిష్టకు అంబర్ హెర్డ్ భంగం కలిగించినట్లు అమెరికా న్యాయస్థానం నిర్ధరించింది. జానీ vs అంబర్: ది US ట్రయల్ అనేది ఈ అంశంపై వస్తున్న డాక్యుమెంటరీ.

OTT ప్లాట్‌ఫారమ్ : డిస్కవరీ ప్లస్ విడుదల తేదీ  – సెప్టెంబర్ 19, 2022

  • ఫోర్స్ ఆఫ్ నేచర్

అకాడమీ స్టార్ విజేత మెల్ గిబ్సన్ రిటైర్డ్ డిటెక్టివ్‌గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఒక సాహసోపేతమైన పోలీసు, డాక్టర్, రిటైర్డ్ డిటెక్టివ్ బృందం… ఘోరమైన దొంగల ముఠాతో పోరాడుతుంది. ఈలోపే ఓ పెను తుఫాన్ విరుచుకుపడుంది. నగరం మొత్తం నీటిలో మునిగిపోయేలోపు వారు ఈ దొంగల మఠాకు చెక్ పెట్టి.. నగరం నుండి సజీవంగా ఎలా తప్పించుకున్నారన్నది స్టోరీ.

OTT ప్లాట్‌ఫారమ్ : లయన్స్‌గేట్ ప్లే విడుదల తేదీ  – సెప్టెంబర్ 16, 2022 దర్శకత్వం : మైఖేల్ పోలిష్ భాష : ఇంగ్లీష్

  • దేవ్‌దత్ పట్టానాయక్ S3తో దేవ్‌లోక్

OTT ప్లాట్‌ఫారమ్ : డిస్కవరీ ప్లస్ విడుదల తేదీ  – సెప్టెంబర్ 16, 2022

  • కాలేజ్ రొమాన్స్ S3

OTT ప్లాట్‌ఫారమ్ : SonyLIV విడుదల తేదీ  – సెప్టెంబర్ 15, 2022 దర్శకత్వం : పారిజాత్ జోషి భాష : హిందీ

  • అటెన్షన్ ప్లీజ్

OTT ప్లాట్‌ఫారమ్ : నెట్ ఫ్లిక్స్ విడుదల తేదీ  –సెప్టెంబర్ 16, 2022 భాష : మలయాళం

  •  గుడ్ నైట్ మమ్మీ

OTT ప్లాట్‌ఫారమ్ : అమెజాన్ ప్రైమ్ విడుదల తేదీ  –సెప్టెంబర్ 16, 2022 భాష : ఇంగ్లీష్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..