AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పెళ్లై 8 ఏళ్లు అవుతోన్నా శారీరకంగా కలవని భర్త.. అసలు విషయం తెలిసిన భార్య గుండె బద్దలైంది..

Viral News: ఓ జంటకు పెళ్లై 8 ఏళ్లు గడిచాయి. అయితే భర్త ఒక్కసారి కూడా భార్యకు శారీరకంగా దగ్గరకాలేదు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన భార్య నిలదీయగా తనకు జరిగిన ఓ ప్రమాదం కారణంగా సంసారానికి పనికిరానని తెలిపాడు. చిన్న సర్జరీ చేసుకుంటే...

Viral: పెళ్లై 8 ఏళ్లు అవుతోన్నా శారీరకంగా కలవని భర్త.. అసలు విషయం తెలిసిన భార్య గుండె బద్దలైంది..
Representative Image
Narender Vaitla
|

Updated on: Sep 16, 2022 | 7:10 PM

Share

Viral News: ఓ జంటకు పెళ్లై 8 ఏళ్లు గడిచాయి. అయితే భర్త ఒక్కసారి కూడా భార్యకు శారీరకంగా దగ్గరకాలేదు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన భార్య నిలదీయగా తనకు జరిగిన ఓ ప్రమాదం కారణంగా సంసారానికి పనికిరానని తెలిపాడు. చిన్న సర్జరీ చేసుకుంటే సెట్‌ అవుతుందని చెప్పి.. కొన్ని రోజుల తర్వాత సర్జరీ చేసుకొని వచ్చాడు. అనంతరం భార్యతో కలవడం ప్రారంభించాడు. అయితే ఆ సర్జరీ ఏంటో తెలిసిన భార్య గుండె ఒక్కసారిగా బద్దలైంది. ఇంతకీ ఆ సర్జరీ ఏంటి.? ఆమెను అంతలా దిగ్భ్రాంతికి గురి చేసిన ఆ విషయం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఓ మహిళ భర్త 2011లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో మూడేళ్ల పాటు ఒంటరిగా జీవించిన సదరు మహిళ 2014లో ఢిల్లీకి చెందిన విరాజ్‌ వర్దన్‌ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. పెళ్లైతే జరిగింది కానీ పెళ్లి జరిగిన నాటి నుంచి జంట శారీరకంగా మాత్రం కలవలేదు. విరాజ్‌ భార్యను ఏదో ఒక కారణంతో దూరం పెడుతూ వచ్చాడు. అయితే ఒకానొక సమయంలో భార్య ఒత్తిడి పెంచగా.. రష్యాలో ఉన్న సమయంలో తనకు ప్రమాదం జరిగిందని అందుకే కలవలేకపోతున్నానని చెప్పాడు. చిన్న సర్జరీ చేసుకుంటే అంతా సెట్‌ అవుతుందని తెలిపాడు.

ఈ నేపథ్యంలోనే 2020లో బరువు తగ్గే సర్జరీ ఉందంటూ కోల్‌కతా వెళ్లిన విరాజ్‌.. తిరిగి వచ్చాక భార్యతో శారీరకంగా కలవడం ప్రారంభించాడు. అయితే అతను కోల్‌కతా వెళ్లింది బరువు తగ్గడం కోసం కాదని.. పురుషుడి అవయవాల మార్పిడి కోసమని వైద్యుడి రిపోర్ట్‌ చూసిన భార్యకు తెలిసిపోయింది. ఢిల్లీకి చెందిన ఆ వ్యక్తి విరాజ్‌ కాదని విజైతా అనే యువతి అనే నిజం తెలిసి ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఒక అమ్మాయిని ఇన్నాళ్లు భర్తగా భావించిన ఆమె కాళ్ల కింద భూమి కంపించింది. విరాజ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులపై సదరు మహిళ కేసు పెట్టింది. దీంతో ఢిల్లీలో ఉన్న అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వడోదరకు తీసుకొచ్చి. అనంతరం భార్య, భర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..