optical Illusion: కళ్లు బాగా పెద్దవి చేసి చూడండి.. ఈ ఫోటోలో దాగున్న మాయాజాలం కనిపెట్టండి..
optical Illusion: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆప్టికల్ ఇల్యూజన్ గురించి. కెమెరా కంటికి చిక్కిన వింత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ...
optical Illusion: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆప్టికల్ ఇల్యూజన్ గురించి. కెమెరా కంటికి చిక్కిన వింత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ వాటి వెనకాల ఉన్న మర్మాన్ని గుర్తించండి అంటూ సవాళ్లు విసురుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నెట్టింట ఓ ఫొటో తెగ సందడి చేస్తోంది. ఈ ఫొటో చూసిన తర్వాత కెమెరా మ్యాన్ ఆలోచనకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు. అంతేకాకుండా ఆ ఫొటోలో ఉన్న మ్యాజిక్ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
పైన ఉన్న ఫొటోను మొదటిసారి చూడగానే అసలు అందులో ఏం ఉందో ఏమాత్రం అర్థం కావట్లేదు కదూ. ఏదో ఫొటోని పోస్ట్ చేసి ఏముందో కనిపెట్టండి అంటున్నారు ఏంటి.? అనుకుంటున్నారు కదూ! కానీ ఓసారి తీక్షణంగా గమనించండి అందులో ఓ కారు ఉంది. ఏంటి ఊహకు కూడా అందడం లేదు కదూ.. అసలు అందులో కారు ఎక్కడా అని పెదవి విరుస్తున్నారా. అయితే ఓసారి ఫొటోకి మిడిల్‌లో ఎడమవైపు కింద టైర్ కనిపిస్తోంది గమనించారా.. అవును ఆ టైర్ కారుదే. ఆ కారు పూర్తిగా బ్లాక్ కలర్‌లో ఉండడంతో అవతలి వైపు ఉన్న చెట్లు, రాళ్లు అందులో రిఫ్లెక్ట్ అయ్యాయి. అందులో ఫొటోలో అసలు ఏముందో కనిపెట్టడం కష్టంగా మారింది. ఏది ఏమైనా ఈ ఫొటో తీసిన వ్యక్తి ట్యాలెంట్ నిజంగా గ్రేట్ కదూ.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..