AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: రహస్య సమాచారంతో పోలీసుల దాడులు.. అడ్డంగా బుక్కయిన యువతీయువకుడు.. మరో ఊహించని ట్విస్ట్

మాములుగా ఏదైనా నేరానికి సంబంధించి.. పోలీసులకు కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు వాంగ్మూలం అవసరం. ఈ క్రమంలో వారి పక్కింటి వ్యక్తి దగ్గర నుంచి స్టేట్‌మెంట్ తీసుకుంటుండగా అతగాడి బాగోతం కూడా బయటపడింది.

Viral: రహస్య సమాచారంతో పోలీసుల దాడులు.. అడ్డంగా బుక్కయిన యువతీయువకుడు.. మరో ఊహించని ట్విస్ట్
Cannabis Plant Grown In Kitchen
Ram Naramaneni
|

Updated on: Sep 16, 2022 | 5:10 PM

Share

గంజాయిపై దేశవ్యాప్తంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కేరళ(Kerala)లో సైతం పోలీసులు మత్తుగాళ్ల తోలు తీస్తున్నారు. ఈ క్రమంలో గంజాయికి బానిసైన కొందరు రిస్క్ ఎందుకుందని.. సైలెంట్‌గా ఇళ్లలోనే గంజాయి మొక్కల పెంపకం చేస్తున్నారు. తాజాగా అక్కడి కక్కనాడ్‌(Kakkanad)లో తమ ఫ్లాట్‌లోని వంటగదిలో గంజాయి పెంచుతున్న ఇద్దరు వ్యక్తులను యాంటీ నార్కోటిక్స్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. నిందితులను కొన్నికి చెందిన వల్యతెక్కెతిల్ అలాన్ (26), ఇన్ఫో పార్క్‌లోని ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో పనిచేస్తున్న కాయంకుళానికి చెందిన పుతన్‌పురక్కల్ అపర్ణ (24)గా గుర్తించారు. కక్కనాడ్‌ నీలంపతింజమొఘల్‌లోని వారు నివశిస్తున్న ఫ్లాట్‌లో గంజాయి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. వంటగదిలో నాటిన నాలుగు నెలల వయసున్న ఆ మొక్క..  ఒకటిన్నర మీటరు పొడవున్నట్లు అధికారులు తెలిపారు. ఆ మొక్క ఏపుగా పెరిగేందుకు వీలుగా అక్కడి అమర్చిన.. ఎల్‌ఈడీ లైట్ మరియు ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రహస్య సమాచారం మేరకు ఆ ఇంటిపై దాడిచేసినట్లు వెల్లడించారు. కాగా ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని.. నిందితుల ఇంటి పక్కన నివాసం ఉంటున్న అమల్ (28) అనే వ్యక్తిని కోరారు. వాంగ్మూలం తీసుకుంటుండగా.. అమల్ ప్రవర్తనపై అనుమానం రావడంతో.. చెక్ చేయగా అతడి వద్ద కూడా గంజాయి పట్టుబడింది.

Ganja

Ganja

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి