అమ్మాయిల ఇష్టాన్ని గౌరవించమని చెప్పే.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’

Aa Ammayi Gurinchi Meeku Cheppali:  సమాజంలో, ఆడపిల్లల తల్లిదండ్రుల భయాందోళనలు ఎలా ఉంటాయి? పరువు ప్రతిష్టలకు ప్రాముఖ్యతినిచ్చేవాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయి? తీరా బిడ్డలని పోగొట్టుకున్నాక, వారి ఆవేదన ఎలా ఉంటుంది? వంటి సెన్సిటివ్‌ విషయాలను స్క్రీన్‌ మీద సెన్సిటివ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు మోహనకృష్ణ ఇంద్రగంటి.

అమ్మాయిల ఇష్టాన్ని గౌరవించమని చెప్పే.. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'
Aa Ammayi Gurinchi Meeku Ch
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Basha Shek

Updated on: Sep 16, 2022 | 1:15 PM

Aa Ammayi Gurinchi Meeku Cheppali:  సమ్మోహనం నుంచి ఇంద్రగంటి మోహనకృష్ణతో ట్రావెల్‌ చేస్తున్నారు సుధీర్‌బాబు. ఆ తర్వాత వీ సినిమా చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చేశారు. గత కొన్నాళ్లుగా పర్ఫెక్ట్ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న సుధీర్‌బాబుకి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఎలాంటి చిత్రమవుతుంది? చూసేద్దాం.

సినిమా: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

నిర్మాణ సంస్థ: బెంచ్‌ మార్క్ స్టూడియోస్‌, మైత్రీ మూవీ మేకర్స్

ఇవి కూడా చదవండి

నటీనటులు: సుధీర్‌బాబు, కృతి శెట్టి, శ్రీనివాస్‌ అవసరాల, వెన్నెలకిశోర్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు

నిర్మాతలు: బి. మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి

కెమెరా: పి.జి.వింద

ఎడిటింగ్‌: మార్తాండ్‌.కె.వెంకటేష్‌,

సంగీతం: వివేక్‌ సాగర్‌

దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి

విడుదల: సెప్టెంబర్‌ 16, 2022

నవీన్‌.కె (సుధీర్‌బాబు) కమర్షియల్‌ చిత్రాల దర్శకుడు. ఆయన అప్పటిదాకా తీసిన సినిమాలన్నీ హిట్‌ అయి ఉంటాయి. ఒకసారి రోడ్డు మీద వెళ్తుంటే ఓ రీల్‌ దొరుకుతుంది. అందులో ఉన్న అమ్మాయి నచ్చడంతో ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆమె డాక్టర్‌ అలేఖ్య (కృతి శెట్టి) అని కనిపెడతాడు. ఆమెతో ఓ మంచి విమెన్‌ ఓరియంటెడ్‌ సినిమా చేయాలని అనుకుంటాడు. అలేఖ్యకి సినిమా రంగం అంటే ఇష్టం ఉండదు. ఆమె తల్లిదండ్రులకు కూడా ఇష్టం ఉండదు. ఒకానొక సందర్భంలో నవీన్‌ చెప్పిన ఓ మాటకు అలేఖ్య కనెక్ట్ అవుతుంది. అతని కోసం సినిమాలో నటిస్తుంది. తల్లిదండ్రులు ఆ పని చేయవద్దని చెప్పినా వినదు. అంతలా ఆమెలో మార్పు రావడానికి కారణం ఏంటి? ఇంతకీ నవీన్‌ ఆమెతో చెప్పిన మాట ఏంటి? అఖిల్‌తో అలేఖ్యకి ఉన్న అనుబంధం ఏంటి? అసలు అఖిల జీవితంలో ఏం జరిగింది? వంటివి ఆసక్తికరమైన అంశాలు.

ఎలాంటి కేరక్టర్‌ అయినా ఈజ్‌తో చేస్తారు సుధీర్‌బాబు. ఈ సినిమాలో డైరక్టర్‌గా ఆ ఈజ్‌ చూపించారు. కృతి శెట్టి గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో చాలా బాగా చేశారు. సినిమా రంగం పట్ల ప్యాషన్‌ ఉన్న అమ్మాయిగా, ఇంట్లో వాళ్ల మాట జవదాటని డాక్టర్‌గా.. వేరియేషన్‌ చక్కగా చూపించారు. హీరోయిన్‌ తండ్రి కేరక్టర్‌లో అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ మేన్‌గా శ్రీకాంత్‌ అయ్యంగార్‌ నటన మెప్పిస్తుంది. సైంటిస్ట్ కేరక్టర్‌లో అవసరాల శ్రీనివాస్‌ చక్కగా సరిపోయారు. కో డైరక్టర్‌గా వెన్నెల కిశోర్‌ జీవించేశారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఫాలో అయ్యే రైటర్‌గా రాహుల్‌ రామకృష్ణ కేరక్టర్‌ అర్థవంతంగా ఉంది. సినిమాలు జనాల మీద ప్రభావం చూపిస్తాయనే విషయాన్ని ఒక సన్నివేశంలో చాలా కన్విన్సింగ్‌గా చెప్పారు డైరక్టర్‌. తెలిసి రాసినా, తెలియకుండా ఫ్లోలో రాసినా, సినిమాల్లోని కొన్ని డైలాగులు సామాన్యులను ప్రభావితం చేస్తాయనే సీన్‌ బావుంది. ఆ సన్నివేశంలో సుధీర్‌బాబు నటన కూడా మెప్పిస్తుంది. ప్రతిరోజూ ఏవో చెడు వార్తలు చూస్తూ గడుపుతున్న సమాజంలో, ఆడపిల్లల తల్లిదండ్రుల భయాందోళనలు ఎలా ఉంటాయి? సమాజానికి భయపడి, పరువు ప్రతిష్టలకు ప్రాముఖ్యతినిచ్చేవాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయి? తీరా బిడ్డలని పోగొట్టుకున్నాక, వారి ఆవేదన ఎలా ఉంటుంది? వంటి సెన్సిటివ్‌ విషయాలను స్క్రీన్‌ మీద సెన్సిటివ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు మోహనకృష్ణ ఇంద్రగంటి.

పాటలు మళ్లీ మళ్లీ పాడుకునేలా లేవు. కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాలను ఇంకాస్త బలంగా చూపించాల్సిందేమో. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్‌ కాస్త స్పీడందుకున్నట్టు అనిపిస్తుంది. కూతుళ్లు చేసే పనులు చూసి తల్లిదండ్రులు గర్వపడాలని చెప్పే పాయింట్‌తో సాగే సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.

రేటింగ్‌: 2.5/5

– డా. చల్లా భాగ్యలక్ష్మి