AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిన్న కుక్క పిల్లపై ప్రేమను కురిపించిన ఒంటె.. హృదయాన్ని తాకుతున్న వీడియో వైరల్..

కొండ ప్రాంతంలో ఓ ఒంటె ప్రశాంతంగా నిల్చొని ఉంది. ఒంటె ఎదురుగా ఓ చిన్న కుక్క మొరిగడం వీడియోలో చూడవచ్చు. ఒకటికి రెండు సార్లు మొరిగిన తర్వాత భయంగా ఒంటె దగ్గరికి చేరుకుంది.

Viral Video: చిన్న కుక్క పిల్లపై ప్రేమను కురిపించిన ఒంటె.. హృదయాన్ని తాకుతున్న వీడియో వైరల్..
Animal Viral Video
Surya Kala
|

Updated on: Sep 16, 2022 | 6:53 PM

Share

Viral Video: కొన్నిసార్లు సోషల్ మీడియాలో వైరల్‌గా అయ్యే వీడియోలు హృదయాన్ని తాకుతాయి. జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు కూడా అటువంటి కోవకే చెందుతాయి. సింహం, పులి, చిరుతపులి మొదలైన వాటి వేటకు సంబంధించిన వీడియోలు సాధారణంగా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ జంతువులు ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జంతువులుగా పరిగణించబడుతున్నాయి. అయితే కొన్ని జంతువులు శాంతి-ప్రేమగలవి.. ఇవి చిన్న జంతువులతో సామరస్యంగా జీవిస్తాయి.. ప్రేమతో చూస్తాయి. ప్రస్తుతం అలాంటి ఒక జంతువు  వీడియో వైరల్ అవుతోంది. ఇది ఖచ్చితంగా మీ హృదయాన్ని తాకుతుంది.

మీరు ఒంటెలను చూసి ఉండాలి. అవి చాలా పెద్దవి. వీటిని ఎడారి నౌక అని కూడా అంటారు. ఎడారుల్లో నీరు త్రాగకుండా చాలా రోజులు జీవించడం ఒంటెల అతిపెద్ద లక్షణం. ఒంటెలు నడవడం, పరుగెత్తడం, మనుషులను ఎక్కించుకుని ప్రయాణించడం చూసి ఉంటారు. అయితే ఒంటెలు మరే ఇతర జంతువుతోనైనా ప్రేమలో పడటం చూశారా? ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో అలాంటి సన్నివేశం కనిపిస్తోంది. ఇందులో ఒంటె చిన్న కుక్కను ప్రేమిస్తున్నట్లు కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఒంటె, కుక్క హృదయాన్ని హత్తుకునే వీడియో:

ఎడారిలోని కొండ ప్రాంతంలో ఓ ఒంటె ప్రశాంతంగా నిల్చొని ఉంది. ఒంటె ఎదురుగా ఓ చిన్న కుక్క మొరిగడం వీడియోలో చూడవచ్చు. ఒకటికి రెండు సార్లు మొరిగిన తర్వాత భయంగా ఒంటె దగ్గరికి చేరుకుంది. మొదట ఒంటె .. ఆ కుక్కని చంపడానికి ప్రయత్నిస్తుందా అనిపిస్తుంది చూపరులకు. అయితే  అలాంటిదేమీ జరగదు. ఒంటె కుక్కని ప్రేమగా నిమురుతుంది. కుక్క తన దగ్గరికి రాగానే ఒంటె తన బిడ్డలాగా వంగి ముద్దులు పెడుతుంది.

ఈ అద్భుతమైన వీడియోను ఐపిఎస్ అధికారి దీపాంశు కబ్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ‘చిన్నపిల్లలకు ప్రేమను ఇవ్వడానికి మీరు ఎంతగా పరితపిస్తారో ఈ వీడియోనే ప్రత్యక్ష సాక్షం అని అంటున్నారు.  కేవలం 20 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 26 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి భిన్నమైన రియాక్షన్స్ ఇస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌