AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beautiful Handwriting: చేతి రాత కూడా అందమైన ఆర్ట్.. మీరు ఎప్పుడైనా ఇంత అందమైన చేతిరాతను చూశారా..

అయితే కొందరి చేతి రాత.. ముత్యాల్లా.. అందమైన ఆర్ట్ లా ఉంటే.. మరికొందరి చేతి రాత గజిబిజిగా ఉంటుంది. ఇటువంటి స్టూడెంట్స్ తమ టీచర్స్ చే దెబ్బలు తిన్నవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చేతివ్రాత వీడియో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

Beautiful Handwriting: చేతి రాత కూడా అందమైన ఆర్ట్.. మీరు ఎప్పుడైనా ఇంత అందమైన చేతిరాతను చూశారా..
Beautiful Handwriting
Surya Kala
|

Updated on: Oct 07, 2022 | 1:24 PM

Share

వ్యక్తి చేతి రాత అతని ఆలోచనాతీరుకు అద్దం అని కొందరు వ్యాఖ్యానిస్తారు. స్టూడెంట్స్ కు చేతిరాత ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చేతి రాత అందంగా ఉంటె.. నల్ల ముత్యాలను ఏరుకోవచ్చని.. చేతి రాత అర్ధం కాకుండా ఉంటె.. బ్రహ్మ కు సాధ్యం కాదంటూ సరదాగా వ్యాఖ్యానిస్తారు కూడా.. అవును ఏ విద్యార్థికైనా.. అతని చేతివ్రాత చాలా ముఖ్యమైనది. రాత బాగుంటే ఆ స్టూడెంట్ ను టీచర్ అమితంగా ప్రేమిస్తారు. ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంటారు కూడా.. జాతిపిత మహాత్మా గాంధీ తన చేతిరాత అందంగా లేదని జీవితాంతం తంటాలు పడ్డాడు. మంచి చేతిరాతతో అనేక మంది విద్యార్థులు తమకు విద్యాబుద్ధాలు నేర్పిన  ఉపాధ్యాయులకు ఇష్టమైన వారిగా మిగిలిపోయారో చాలామందికి తెలుసు. అందుకే చిన్నతనంలో పిల్లల మన చేతివ్రాతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. తమ చేతి రాత మెరుగుపరిచేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అయితే కొందరి చేతి రాత.. ముత్యాల్లా.. అందమైన ఆర్ట్ లా ఉంటే.. మరికొందరి చేతి రాత గజిబిజిగా ఉంటుంది. ఇటువంటి స్టూడెంట్స్ తమ టీచర్స్ చే దెబ్బలు తిన్నవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చేతివ్రాత వీడియో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన తర్వాత మహా మహా మేథావులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

ఒకప్పుడు మనుషుల మనస్తత్వాలను వారి చేతి రాత ఆధారంగా అంచనా వేసేవారు. ఎవరి రాత చాలా అందంగా ఉందో.. వారిని  ప్రజలు చాలా గౌరవించేవారు. అయితే ఇప్పుడు మనమందరం డిజిటల్ యుగంలో ఉన్నాం.. ఇంకా చెప్పాలంటే.. ప్రస్తుత జనరేషన్ రాయడం మరచిపోయింది అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైన అందమైన రాత కనిపిస్తే కళ్లు ఆనందంతో మెరుస్తాయి. అలాంటి ఒక అందమైన చేతివ్రాత  ప్రస్తుతం చర్చలో ఉంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి: 

పుస్తకంపై అందంగా  రాస్తున్న వీడియో వైరల్ అవుతుంది.  కలంలోంచి ముత్యాలు రాలుతున్నాయా అనిపిస్తుంది చూపరులకు. అవును ఓ వ్యక్తి అంత అందంగా రాస్తున్నాడు. చేతివ్రాత చూసిన తర్వాత.. ఇది నిజంగా చేతితో వ్రాసిందా లేదా కంప్యూటర్ డిజైనర్ ఫాంట్ అని ఒక్క క్షణమైనా ఆలోచిస్తారు.

ఈ వీడియోను @TansuYegen అనే ట్విట్టర్ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను 12 లక్షల మందికి పైగా వీక్షించారు.  ‘ఇంత అందమైన చేతి రాతను నేను ఎప్పుడూ చూడలేదు’ అని ఒకరు రాశారు. అదే సమయంలో, ‘ఈ అమ్మాయి చేతిలో నిజంగా మ్యాజిక్ ఉంది’ అని మరొక వినియోగదారు రాశారు. ఇలా చాలా మంది చేతి రాతను ఇష్టపడుతూ.. తమ అభిప్రాయాన్ని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..