Geoscan Show: ఒక షోలో స్టేడియం మీద ఎగురుతున్న భారీ డ్రాగన్.. అసలు నిజం తెలిస్తే తెలిస్తే షాక్ అవ్వడం గ్యారంటీ..

ఈ వీడియోలో ఒక పెద్ద డ్రాగన్ గాలిలో ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. దాని పెద్ద నోరు కూడా తెరవడానికి ప్రయత్నిస్తోంది.  డ్రాగన్.. స్టేడియం మీదుగా ఆకాశంలో ఎగురుతున్న వీడియోను మీరు చూడవచ్చు.

Geoscan Show: ఒక షోలో స్టేడియం మీద ఎగురుతున్న భారీ డ్రాగన్.. అసలు నిజం తెలిస్తే  తెలిస్తే షాక్ అవ్వడం గ్యారంటీ..
Dragon In Geoscan Show
Follow us
Surya Kala

|

Updated on: Oct 02, 2022 | 6:31 PM

డ్రాగన్ అని పేరు వినగానే వెంటనే అందరికీ హాలీవుడ్ సినిమాలు, చైనా దేశం, డ్రాగన్ ఫ్రూట్ గుర్తుకొస్తుంది. ఇక డ్రాగన్ జీవి అత్యంత భయంకరంగా ఉన్నట్లు హాలీవుడ్ లో చైనా సీరియల్స్ లో సినిమాల్లో చూస్తున్నాం.. అయితే పాము లా కనిపించే ఈ డ్రాగన్ జీవి ఒక కల్పిత జీవి అన్న సంగతి కొందరికే తెలుసు. జానపద కథల్లో కనిపించే ఈ జీవి అత్యంత పొడవాటి తోటను కలిగి ఉంటుంది. రెక్కలు లేకపోయినా గాలిలో ఎగురుతుంది. తన నోరుని భయంకరంగా తెరచి నిప్పులు చిమ్ముతుంది. ఈ ప్రమాదకరమైన జీవి ప్రస్తావన చైనా జానపద కథల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. డ్రాగన్ జీవి అనేక చిహ్నాల్లో దర్శనమిస్తుంది. అయితే నిజానికి మిలియన్ల సంవత్సరాల క్రితం అంటే డైనోసార్ల యుగంలో ఈ జీవులు ఉండేవని నమ్ముతారు. కానీ కొందరు.. నేటి యుగంలో కూడా.. ఈ జీవిని చూశామని కొందరు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అసలు నిజం తెలిస్తే మీరు కూడా స్టన్ అవుతారు.

వాస్తవానికి, ఈ వీడియోలో ఒక పెద్ద డ్రాగన్ గాలిలో ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. దాని పెద్ద నోరు కూడా తెరవడానికి ప్రయత్నిస్తోంది.  డ్రాగన్.. స్టేడియం మీదుగా ఆకాశంలో ఎగురుతున్న వీడియోను మీరు చూడవచ్చు. అయితే నిజమైన డ్రాగన్ కాదు..  ఇది మానవసృష్టి..  వెయ్యి డ్రోన్ల సహాయంతో తయారు చేసి గాలిలో ఎగురవేశారు. అరుదైన , అందమైన ఈ దృశ్యం డ్రోన్ షో లో చోటు చేసుకుంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వందల వేల డ్రోన్‌లు కలిసి ఉపయోగించిన ప్రదర్శనను మీరు చాలా అరుదుగా చూస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @TansuYegen అనే ID పేరుతో షేర్ చేశారు. ‘జియోస్కాన్ షో సమయంలో డ్రాగన్ మేడ్ 1000 డ్రోన్‌లు’ అనే శీర్షికతో పోస్ట్ చేశారు. కేవలం 5 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 15 మిలియన్ల మంది అంటే 1.5 కోట్ల మంది వీక్షించగా.. 19 వేల మందికి పైగా లైక్ చేశారు.

అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా అందమైన దృశ్యమని కొందరు చెబుతుండగా, కొందరు దీనికి ‘గేమ్ ఆఫ్ డ్రోన్స్’ అని పేరు పెట్టారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..