World Largest Flower: ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు.. ఇది వికసిస్తుంటే వీలైనంత దూరం పారిపోవాల్సిందే ఎవరైనా.. ఎందుకో తెలుసా
ఓ వ్యక్తి ఇండోనేషియాలోని ఓ అడవిలో ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో అరుదైన ప్రకృతి వింత దర్శనమిచ్చింది. శవం కుళ్ళిన వాసన వస్తుంటే.. అది ఏమిటా అని పరిశీలించిన అతనికి ప్రపంచంలో అతి పెద్ద పువ్వు కనిపించింది.
ప్రకృతిలో అందాలు ఎన్నో ఉన్నాయి.. కనులకు విందు చేసేవి కొన్ని.. మదిని మరిపించేవి కొన్ని.. కలకలం జ్ఞాపకాల్లో నిలిచిపోయేవి ఇంకొన్ని.. అయితే పువ్వులు అందం.. అవి వెదజల్లే సువాసన అందరికీ ఇష్టమే.. హిందూ సంప్రదాయంలో పువ్వులకు విశిష్ట స్థానం ఉంది. పూజలను వేడుకల సమయంలో అలంకరణ కోసం పువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తాం. అంతేకాదు ఔషధ గుణాలు కూడా మెండు. అయితే ప్రపంచంలో అతి పెద్ద పువ్వు ఏమిటో తెలుసా.. ఈ పువ్వు వికసించడానికి దాదాపు నాలుగు రోజులు పడుతుందట.. అంతేకాదు ఈ పువ్వునుంచి వచ్చే వాసనను భరించలేక దూరంగా పారిపోవాలి.. ప్రస్తుతం ప్రపంచంలోని అతి పెద్ద పువ్వు వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
నడక శరీరానికి , మెదడుకు మేలు చేసే అద్భుతమైన అవుట్‌డోర్ యాక్టివిటీ. ఇక ప్రకృతి అందాల మధ్య.. నడుస్తుంటే అప్పుడు మనసు ఎలా ఫీల్ అవుతుందో ఎంత చెప్పినా తక్కువే.. అలా ఓ వ్యక్తి ఇండోనేషియాలోని ఓ అడవిలో ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో అరుదైన ప్రకృతి వింత దర్శనమిచ్చింది. శవం కుళ్ళిన వాసన వస్తుంటే.. అది ఏమిటా అని పరిశీలించిన అతనికి ప్రపంచంలో అతి పెద్ద పువ్వు కనిపించింది. ఈ పువ్వు రాఫ్లేసియా ఆర్నాల్డి.. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది..ఈ పువ్వు వికసించే సమయంలో విపరీతమైన దుర్వాసనకు వెదజల్లడంలో ప్రసిద్ధి చెందింది. ఇది 3 అడుగుల వరకు వికసిస్తుంది. 15 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. నౌ దిస్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో అడవుల్లో నేలపై ఉంది. ఈ భారీ పుష్పం ఐదు ఎర్రటి పువ్వు ను కలిగి ఉంది. పూర్తిగా వికసించింది. ఎర్రటి రేకుల మీద తెల్లటి మచ్చలతో చూడడానికి అందంగా అనిపిస్తుంది. ఈ పుష్పం వికసించడానికి దాదాపు నాలుగు రోజులు పడుతుంది. దీని రేకలు అంత పెద్దగా ఉంటాయి మరి.
A man came across this rare flower while walking through an Indonesian forest. The rafflesia arnoldii is the largest flower in the world & only blooms for a couple of days. It is colloquially known as a corpse flower for the overpoweringly stinky odor it emits while mid-bloom. pic.twitter.com/LJmJDgfpqd
— NowThis (@nowthisnews) September 28, 2022
నెట్టింట్లో ఈ పుష్పం వీడియో వైరల్ అవుతుంది. ఈ పుష్పం నెటిజన్లను ఆకర్షిస్తుంది. “ఇది గ్రహాంతరవాసుల నుండి వచ్చినట్లు కనిపిస్తోంది” అని కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..