Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China President: గృహనిర్బంధంలో చైనా అధ్యక్షుడు..! పుకార్లపై విచారణ జరిపించాలంటూ సుబ్రమణ్య స్వామి డిమాండ్

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. జిన్‌పింగ్‌ని నిజంగానే అరెస్టు చేశారనీ లేదా ఆర్మీ చీఫ్‌ పదవి నుంచి ఆయనను తొలగించారని ఏ అంతర్జాతీయ మీడియా కూడా ఈ వార్తను ధృవీకరించలేదు.

China President: గృహనిర్బంధంలో చైనా అధ్యక్షుడు..! పుకార్లపై విచారణ జరిపించాలంటూ సుబ్రమణ్య స్వామి డిమాండ్
Chinese President Xi Jinpin
Follow us
Surya Kala

|

Updated on: Sep 24, 2022 | 6:24 PM

China President: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను బీజింగ్‌లో గృహనిర్బంధంలో ఉంచారా? ఈ ప్రశ్న సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరోవైపు బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ మరింత సంచలనంగా మారింది. ‘సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న రూమర్‌పై దర్యాప్తు చేయాలి. బీజింగ్‌లో జీ జిన్‌పింగ్ గృహ నిర్బంధంలో ఉన్నారా?  జిన్‌పింగ్ ఇటీవల సమర్‌కండ్‌లో ఉన్నప్పుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నాయకులు ఆయనను ఆర్మీ చీఫ్ పదవి నుండి తొలగించారని అంటారు. ఆపై గృహనిర్బంధంలో ఉంచారని సోష‌ల్ మీడియాలో ఇలాంటి పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పుకార్లపై విచార‌ణ జ‌ర‌గాల్సిందేనని సుబ్రమణ్య స్వామి సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.

అయితే, ఇప్పటివరకు ఇప్పటి వరకూ గృహనిర్బంధం వార్తలను గ్లోబల్ టైమ్స్ , కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నుండి ఎటువంటి అధికారిక ధృవీకరణ చేయలేదు. జీ జిన్‌పింగ్ నిర్బంధం, గృహనిర్బంధానికి సంబంధించి సోషల్ మీడియాలో వేల సంఖ్యలో ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే వాస్తవం ఏంటనేవిషయంపై ప్రస్తుతానికి ఎవరికీ సరైన సమాచారం లేదు. అదే సమయంలో.. చైనా ప్రజలు కూడా జిన్‌పింగ్‌ను హౌస్ అరెస్ట్ చేసినట్లు ట్వీట్ చేస్తున్నారు. మరోవైపు  పాటు జీ జిన్‌పింగ్ ను ఆర్మీ చీఫ్‌ పదవి నుంచి కూడా తొలగించారు.

 ఇంకా వెలువడని అధికారిక ప్రకటన: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. జిన్‌పింగ్‌ని నిజంగానే అరెస్టు చేశారనీ లేదా ఆర్మీ చీఫ్‌ పదవి నుంచి ఆయనను తొలగించారని ఏ అంతర్జాతీయ మీడియా కూడా ఈ వార్తను ధృవీకరించలేదు. ఇటీవల ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఎస్‌సిఓ సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ, వ్లాదిమిర్ పుతిన్, ఇతర దేశాల నేతలు కూడా పాల్గొన్నారు. జిన్‌పింగ్ సమర్‌కండ్ నుండి తిరిగి వచ్చినప్పుడు.. తమ అధ్యక్షుడిని విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ఆ తర్వాత  గృహనిర్బంధంలో ఉంచారని చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..