AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఇదేం పిచ్చక్కా.. తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..

Bengaluru woman courier father: ఈ మధ్య యువతలో రీల్స్ పిచ్చి బాగా పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు జనాలు. ఎన్ని వేషాలైనా వేస్తున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో రీల్స్‌ కోసం ఒక వ్యక్తి తుపాకీతో కాల్చుకుంటే, బెంగళూరులో ఒక ఫ్యామిలీ తమ తండ్రిని పార్శిల్‌ కట్టి కొరియర్‌ చేసేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch: ఇదేం పిచ్చక్కా.. తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
Bengaluru Woman Courier Father
Anand T
|

Updated on: Mar 18, 2026 | 1:43 PM

Share

రీల్స్ కోసం తన తండ్రి ఓ కూతురు పార్శిల్‌ కట్టి కొరియర్‌ చేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నగరంలోని ఒక కొరియర్‌ ఆఫీస్‌కు నిన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వచ్చారు. ఒక పెద్ద మూటను పార్శిల్‌ చేశారు. ఈ మూటను కొరియర్‌ చేయాలన్నారు. అయితే, ఆ మూటలో ఏముందంటూ కొరియర్‌ ఆఫీస్‌ సిబ్బంది అడిగితే, జవాబు చెప్పలేదు. అనుమానం వచ్చిన కొరియర్ సిబ్బంది- ఆ మూటను విప్పి చూడగా అందులో ఒక వృద్ధుడు కనిపించాడు. అది చూసిన స్టాఫ్‌ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అయితే అతను ఎవరు అని ఆరా తీయగా.. ఆ పార్సిల్ తీసుకొచ్చిన యువతి తండ్రి ఆయన అని తెలిసింది. బాక్స్‌ ఓపెన్ చేయగానే ఆయన ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. బస్తాలో కుక్కేయడం వల్ల ఆయన ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతన్టటు వీడియోలో చూడవచ్చు. అయితే ఇదంతా ఎందుకు చేశారని సిబ్బంది వారి కుటుంబ సభ్యులను అడగగా.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం కోసం అని ఆ కుటుంబీకులు సమాధానం చెప్పారు.

ఇదంతా ఎందుకు అని మళ్లీ అడిగితే, అసలు ఉద్దేశం చెప్పారు. ఉగాది, రంజాన్‌ వంటి పండగల సీజన్‌లో మనుషులు ప్రయాణించడం కన్నా, పార్శిళ్లు పంపడం ఈజీ అని చెప్పడమే తమ ఉద్దేశమంటూ ఆ కుటుంబ సభ్యులు వివరించారు. ఈ ఉదంతంపై కొరియర్‌ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ బాధ్యతా రాహిత్యంపై ఆ కుటుంబం చివరకు సారీ చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోను కొరియర్ సంస్థకు చెందిన వారు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంలో ఇది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
ఎవరికీ నచ్చకపోయినా హిట్టు కొట్టాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డ
ఎవరికీ నచ్చకపోయినా హిట్టు కొట్టాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డ
ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి
ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కన్య రాశి వారికి ఇలా..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కన్య రాశి వారికి ఇలా..
మ్యూజిక్‌ను ఆపేసరికి త్రివిక్రమ్ ఒక మాట అన్నాడు.. కానీ.!
మ్యూజిక్‌ను ఆపేసరికి త్రివిక్రమ్ ఒక మాట అన్నాడు.. కానీ.!
డెస్క్‌ జాబ్‌ చేస్తున్నారా? కూర్చున్న చోటే ఈ సింపుల్‌ స్ట్రెచెస్
డెస్క్‌ జాబ్‌ చేస్తున్నారా? కూర్చున్న చోటే ఈ సింపుల్‌ స్ట్రెచెస్
క్రికెట్ దేవుడికే రీప్లేస్‌మెంటా? సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు
క్రికెట్ దేవుడికే రీప్లేస్‌మెంటా? సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు
అప్పుడు భయపెట్టింది.. ఇప్పుడు గ్లామర్‏తో చంపేస్తున్న దెయ్యం పిల్ల
అప్పుడు భయపెట్టింది.. ఇప్పుడు గ్లామర్‏తో చంపేస్తున్న దెయ్యం పిల్ల
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. సింహ రాశి వారికి ఇలా..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. సింహ రాశి వారికి ఇలా..