Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: దేశంలోని ధనవంతుల జాబితాలో.. అత్యంత పిన్న వయస్కురాలైన నేహా.. సెల్ఫ్ మేడ్ ఉమెన్‌ సక్సెస్ స్టోరీ

IFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో కాన్‌ఫ్లూయెంట్ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖేడే 336వ స్థానంలో ఉన్నారు.  సామాన్యురాలి నుంచి అసామాన్యురాలిగా ఎదిగిన నేహా సక్సెస్ గురించి మరింత తెలుసుకుందాం.  

Success Story: దేశంలోని ధనవంతుల జాబితాలో.. అత్యంత పిన్న వయస్కురాలైన నేహా.. సెల్ఫ్ మేడ్ ఉమెన్‌ సక్సెస్ స్టోరీ
Neha Narkhede
Follow us
Surya Kala

|

Updated on: Sep 22, 2022 | 7:56 PM

Success Story: స్ట్రీమింగ్ డేటా టెక్నాలజీ కంపెనీ కాన్‌ఫ్లూయెంట్ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖేడే  ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. దీని వెనుక కారణం ఏమిటంటే.. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 బుధవారం విడుదలైంది. ఇందులో మహారాష్ట్రలోని పూణే నగరంలో జన్మించిన నేహా పేరు కూడా ఉంది. 37 ఏళ్ల భారతీయ అమెరికన్ నేహా నార్ఖేడే సంపన్న వ్యక్తుల జాబితాలో అత్యంత పిన్న వయస్కుడైన మహిళా పారిశ్రామికవేత్తగా పేరుపొందారు. ఈ రోజు నేహా నార్ఖేడే సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం..

నేహా నార్ఖేడే పూణేలో పెరిగారు. USAలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్ విద్యనభ్యసించారు. కాన్‌ఫ్లూయెంట్‌ని స్థాపించడంతో పాటు, నేహా ఓపెన్ సోర్స్ మెసేజింగ్ సిస్టమ్ అపాచీ కాఫ్కా  సహ-సృష్టికర్త కూడా. ప్రస్తుతం ఆమె అనేక టెక్నాలజీ కంపెనీలకు ఇన్వెస్టర్‌గా, సలహాదారుగా పనిచేస్తున్నారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో నేహా నార్ఖేడే 336వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆమె ఆస్తులు విలువ రూ.4,700 కోట్లుగా అంచనా వేసినట్లు సమాచారం. అదే సమయంలో నేహా నార్ఖేడే తన స్వంత కంపెనీని ప్రారంభించే లింక్డ్‌ఇన్, ఒరాకిల్‌లో పనిచేశారు. అపాచీ కాఫ్కా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిన బృందంలో ఒకరు నేహా. ఈ సాఫ్ట్‌వేర్ వినియోగదారులకు సంబంధించిన అనుభవాన్ని అందించడానికి లింక్డ్‌ఇన్‌కి సహాయపడుతుంది.

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..  నేహా తన బృందంతో కలిసి ఈ సాంకేతికతను ఇతర వ్యాపారాల్లో ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. దీంతో  2014లో కాన్‌ఫ్లూయెంట్‌ను స్థాపించారు. నేహా సుమారు 15 సంవత్సరాల క్రితం US వెళ్లి జార్జియా టెక్ నుండి టెక్నాలజీలో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. పూణే యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు.

ఇవి కూడా చదవండి

ఫోర్బ్స్ రూపొందించిన అమెరికా సంపన్నుల స్వీయ-నిర్మిత మహిళల జాబితా 2022లో నేహా 57వ స్థానంలో నిలిచారు. 2018లో ఫోర్బ్స్ జాబితాలో  ప్రపంచంలోని టెక్‌లో టాప్ 50 మంది మహిళలలో ఒకరిగా ఎంపికయ్యారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..