Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiring Story: నాడు కాల్ సెంటర్‌లో రూ.8000 జీతగాడు.. నేడు కోటీశ్వరుడు.. నిఖిల్ కామత్ ప్రస్థానం

నిఖిల్ కామత్ 17 సంవత్సరాల వయస్సులో కాల్ సెంటర్‌లో మొదటిసారిగా ఉద్యోగం చేయడం మొదలు పెట్టారు. అప్పుడు నిఖిల్ కు నెలకు రూ. 8వేలు జీతం..  తన దగ్గర ఉన్న డబ్బులతో స్టాక్‌ మార్కెట్ లో  ట్రేడింగ్ ప్రారంభించారు

Inspiring Story: నాడు కాల్ సెంటర్‌లో రూ.8000 జీతగాడు.. నేడు కోటీశ్వరుడు.. నిఖిల్ కామత్ ప్రస్థానం
Billionaire Nikhil Kamath
Follow us
Surya Kala

|

Updated on: Sep 09, 2022 | 3:16 PM

Inspiring Story: కృషి పట్టుదల ఉంటే .. మనిషి అంబరాన్ని అందుకుంటాడు.. సంద్రాన్ని దాటేస్తాడు.. సమాజంలో తనకంటూ పేరు ప్రఖ్యాతలు పొందుతాడు. అందుకు ఉదాహరణగా అనేకమందిని వ్యక్తులు నిలుస్తుంటారు.. ఈరోజు చిన్న జాబ్ తో కెరీర్ ను మొదలు పెట్టి.. ఇప్పుడు దేశంలో ఒక బిలియనీర్ గా ఎదిగిన స్ఫూర్తివంతమైన వ్యక్తి.. దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టాక్ బ్రోకరేజ్ సంస్థ యజమాని సక్సెస్ స్టోరీ గురించి ఈరోజు తెలుసుకుందాం..

నిఖిల్ కామత్ 17 సంవత్సరాల వయస్సులో కాల్ సెంటర్‌లో మొదటిసారిగా ఉద్యోగం చేయడం మొదలు పెట్టారు. అప్పుడు నిఖిల్ కు నెలకు రూ. 8వేలు జీతం..  తన దగ్గర ఉన్న డబ్బులతో స్టాక్‌ మార్కెట్ లో  ట్రేడింగ్ ప్రారంభించారు. ఒక సంవత్సరం తరువాత అతను ట్రేడింగ్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పుడు, బిలియనీర్ అయిన నిఖిల్ కామత్ దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టాక్ బ్రోకరేజ్ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు.

హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి తన ప్రయాణం గురించి జెరోధా  సహ-వ్యవస్థాపకులు నిఖిల్ కామత్  మాట్లాడుతూ.. తన తండ్రి దాచుకున్న సొమ్ములో కొంతమొత్తాన్ని తనకు ఇచ్చి దీంతో వ్యాపారం మొదలు పెట్టమని చెప్పారని.. అప్పుడు తాను స్టాక్ ట్రేడింగ్ ను ప్రారంభించానని చెప్పారు. అయితే తాను గుడ్డి విశ్వాసంతోనే జర్నీని మొదలు పెట్టినట్లు నిఖిల్ కామత్ అన్నారు.

ఇవి కూడా చదవండి

అనంతరం కాల్ సెంటర్‌లోని తన మేనేజర్‌ని కూడా అలాగే చేయమని ఒప్పించాడు. “ఇది నిఖిల్ కామత్ కి మేలు చేసింది. ఆ మేనేజర్ ఇతరులకు చెప్పాడు… అలా ఒకరి నుంచి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కొంతమందికి చేరుకుంది. దీంతో అందరి డబ్బులను నిఖిల్ నిర్వహించడం మొదలు పెట్టారు. మెల్లగా నిఖిల్ కామత్ గుర్తింపు రావడం మొదలు అయింది. తర్వాత నిఖిల్ తన సోదరుడితో కలిసి కామత్ అసోసియేట్స్‌ను ప్రారంభించారు. అనంతరం 2010లో మేము జెరోధాను ప్రారంభించారు. ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ బ్రోకరేజ్ సంస్థలలో జెరోధా ఒకటిగా నిలిచింది.

అయితే చదువు మానేసిన కామత్ కు డబ్బు సంపాదించడమే నా ఏకైక ప్రణాళిక. ఎందుకంటే నిఖిల్ సాధారణ, మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చారు. తన కజిన్‌లు MBA చదువుకున్నారు. దీంతో నిఖిల్ జీవితంలో ఏమి చేస్తాడు అంటూ కుటుంబ సభ్యుల్లో ఆసక్తి నెలకొంది. అయితే నిఖిల్ పై అతని తల్లిదండ్రులకు అతనిపై నమ్మకం ఉంది. ” అంతేకాదు నిఖిల్ తల్లిదండ్రులు ఒక్కటే చెప్పేవారు.. ‘మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే పని చేయవద్దు!’ అయితే తమ కొడుకు మంచి తెలివైనవాడిని.. గణితంలో మంచి ప్రావీణ్యం ఉందని వారికి నమ్మకం ఉందని నిఖిల్ చెప్పారు.

అంతేకాదు ఇప్పటివరకు తన అనుభవం నుండి నేర్చుకున్న పాఠాల గురించి నిఖిల్ మాట్లాడుతూ.. “స్కూల్ డ్రాపౌట్ నుండి, కాల్ సెంటర్‌లో పని చేయడం, జెరోధా , ట్రూ బెకన్ వరకు తన ప్రయాణంలో రెండు-మూడు విషయాలను గుర్తించానని చెప్పారు. నేను బిలియనీర్‌గా మారడం వల్ల తన జీవితంలో ఎటువంటి మార్పులు లేవని చెప్పారు. తాను ఇప్పటికీ రోజులో 85 శాతం పని చేస్తున్నాను.  ‘ఇది నా నుండి తీసుకుంటే?’ అనే అభద్రతతో జీవిస్తున్నానని చెప్పారు.

కనుక తన ఏకైక సలహా ఏమిటంటే.. మనిషి జీవితంలో సక్సెస్ అందుకోవాలంటే.. మీరు ఇప్పుడు చింతిస్తున్న విషయాల గురించి పట్టించుకోవద్దు.   అంతేకాదు రేపు చేయవలసింది.. ఈ రోజు చేయవలసినది ఎందుకు చేయకూడదని భావించండి.. ఇది ఎలాగైనా నేను చేస్తాను అనే పట్టుదలతో జీవితంలో ముందుకు వెళ్ళండి.. ఈ విశ్వాసం ఉంటే.. వర్క్ అవుట్ అయి.. .ఎలాగైనా జీవితంలో ఎదుగుతారని కామత్ నేటి యువతకు చెప్పారు.

మరిన్నిహ్యుమన్‌ ఇంట్రెస్ట్‌  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..