Bank Interest Rates: ఈ బ్యాంకులో డిపాజిట్లు చేస్తున్నారా..? పెరిగిన వడ్డీ రేట్లు

Bank Interest Rates: ప్రైవేట్ రంగ రుణదాత అయిన యాక్సిస్ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. కొత్త రేట్లు..

Bank Interest Rates: ఈ బ్యాంకులో డిపాజిట్లు చేస్తున్నారా..? పెరిగిన వడ్డీ రేట్లు
Bank Interest Rates
Follow us
Subhash Goud

|

Updated on: Sep 09, 2022 | 12:06 PM

Bank Interest Rates: ప్రైవేట్ రంగ రుణదాత అయిన యాక్సిస్ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. కొత్త రేట్లు సెప్టెంబర్ 7, 2022 నుండి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు 2.50% నుండి 5.75% వరకు, సీనియర్ సిటిజన్లకు 2.50% నుండి 6.50% వరకు వడ్డీ రేట్లతో 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీలతో ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తోంది.

యాక్సిస్ బ్యాంక్ FD రేట్లు

7 రోజుల నుండి 29 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై, బ్యాంక్ 2.50% వడ్డీ రేటును అందిస్తుంది. 30 రోజుల నుండి 3 నెలల వరకు మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై, బ్యాంక్ 3% వడ్డీ రేటును అందిస్తోంది. 3 నెలల నుండి 6 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లు 3.50% వడ్డీ రేటును అందుతుంది. 6 నెలల నుండి 7 నెలలలో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై ఇప్పుడు 4.65% వడ్డీ రేటు లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ 7 నెలల నుంచి 8 నెలల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.40% వడ్డీ రేటును అందిస్తోంది. 8 నెలల నుండి 9 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 4.65% వడ్డీ రేటు కొనసాగుతుంది. 9 నెలల నుండి 1 సంవత్సరం వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 4.75% వడ్డీ రేటు కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

యాక్సిస్ బ్యాంక్ 1 సంవత్సరం నుండి 1 సంవత్సరం 11 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.45% వడ్డీ రేటును కొనసాగిస్తుంది. అలాగే 1 సంవత్సరం 11 రోజుల నుండి 1 సంవత్సరం 25 వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.75% వడ్డీ రేటు, 1 సంవత్సరం 25 రోజుల నుండి 2 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లు 5.60% వడ్డీ రేటు, 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇప్పుడు 5.70% వడ్డీ రేటును పొందుతాయి. యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.75% వడ్డీ రేటును అందిస్తోంది.

సీనియర్ సిటిజన్ల కోసం యాక్సిస్ బ్యాంక్ FD రేట్లు:

7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై, సీనియర్ సిటిజన్లు ఇప్పుడు 2.50% నుండి 6.50% వరకు వడ్డీ రేటును పొందుతారు. 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇప్పుడు సీనియర్ సిటిజన్‌లకు గరిష్టంగా 6.50% వడ్డీ రేటు లభిస్తుంది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్ ద్వారా FD ఖాతా తెరవడానికి అవసరమైన కనీస మొత్తం రూ. 5000. బ్యాంక్ బ్రాంచ్ ద్వారా చేస్తే రూ. 10,000 అని బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..