Post Office Scheme: పోస్టాఫీసులోని ఈ స్కీమ్‌లో చేరండి.. ఐదేళ్లలో 14 లక్షలు పొందండి..!

Post Office Scheme: పోస్టాఫీస్(Post Office)లో అనేక రకాల పథకాలను అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే స్కీమ్‌లు ఉన్నాయి. పోస్టాఫీసు అందించే..

Post Office Scheme: పోస్టాఫీసులోని ఈ స్కీమ్‌లో  చేరండి.. ఐదేళ్లలో 14 లక్షలు పొందండి..!
Post Office Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Sep 09, 2022 | 9:25 AM

Post Office Scheme: పోస్టాఫీస్(Post Office)లో అనేక రకాల పథకాలను అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే స్కీమ్‌లు ఉన్నాయి. పోస్టాఫీసు అందించే పథకాల్లో నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC) ఒకటి. దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం ద్వారా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును కూడా పొందే సదుపాయం ఉంటుంది. ఎన్‌ఎస్‌సిని సీనియర్ సిటిజన్‌లు కూడా ఏకరీతి నెలవారీ ఆదాయాన్ని పొందడానికి ఉపయోగించుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. NSCలను మైనర్‌ కూడా ఈ పథకంలో చేరవచ్చు. అలాగే ఇద్దరు సంయుక్తంగా పథకంలో చేరవచ్చు.

వడ్డీ రేటు

NSC వడ్డీ రేటు ప్రతి త్రైమాసికంలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుత త్రైమాసికంలో రేటు 6.8%. మీరు ఈరోజు 1000 రూపాయలకు ఈపథంలో పొదుపు చేస్తే మీ పెట్టుబడి ఐదేళ్లలో రూ.1389కి పెరుగుతుంది. ముఖ్యంగా, పెట్టుబడికి గరిష్ఠ పరిమితి లేనందున ఇందులో ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. మీరు ఈరోజు రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లలో మీ డబ్బు రూ.13.89 లక్షలకు చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

పన్ను ప్రయోజనం

ఇందులో రూ. 1.5 లక్షల పెట్టుబడి వరకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే NSC మెచ్యూరిటీ అయిన తర్వాత వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ ముందుగా తీసుకోవాలంటే కొన్ని సందర్భాల్లోనే అనుమతి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..