AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఫుడ్ డెలివరీ ఆలస్యంతో అసహంతో కస్టమర్.. డెలివరీ చేసిన వ్యక్తిని చూసి షాక్.. హృదయాన్ని కదిలించే కథనం వైరల్‌

తనకు ఫుడ్ ని ఆలస్యంగా తీసుకుని వచ్చిన ఆ డెలివరీ బాయ్ మీద కోపం వచ్చింది.. బాగా తిట్టాలనే ఉద్దేశ్యంతో కోపంగా డోర్ తీశాడు రోహిత్.. అయితే అక్కడ తనకు ఫుడ్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని చూసి షాక్ తిన్నాడు. 

Viral News: ఫుడ్ డెలివరీ ఆలస్యంతో అసహంతో కస్టమర్.. డెలివరీ చేసిన వ్యక్తిని చూసి షాక్.. హృదయాన్ని కదిలించే కథనం వైరల్‌
Bengaluru Delivery Guy
Follow us
Surya Kala

|

Updated on: Aug 14, 2022 | 2:03 PM

Viral News: కొందరికి అన్ని అవయవాలు, చదువు అవకాశాలున్నా.. జీవితంలో ఎదో తక్కువ అయిందంటూ నిరాశతో బతికేస్తుంటారు.. మరికొందరు.. తమకు అవయవాలు లేకపోయినా, చదువు సంధ్యలు లేకపోయినా దేవుడిచ్చిన జీవితం అంటూ.. ఆనందాన్ని వెదుక్కుంటారు. బతకడం కోసం తమకు చేతనైన పనిని చేస్తారు.. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడో చోట ఇలాంటి అనేక కథల్లాంటి వ్యథలున్న వ్యక్తుల  గొప్పదనం గురించి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ స్విగ్గి ఫుడ్ డెలివరీ బాయ్ కు సంబంధించిన ఓ వార్తల ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఎందుకంటే.. ఆ డెలివరీ బాయ్ కు కాళ్ళు సరిగ్గాలేవు.. కచ్చర్స్ సహాయంతో నడుస్తూ కస్టమర్స్ కు ఫుడ్ ను డెలివరీ చేస్తున్నాడు. ఈ డెలివరీ బాయ్ కు సంబంధించిన విషయాన్నీ లింక్డ్ ఇన్ యూజర్ రోహిత్ కుమార్ సింగ్ షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

బెంగళూరులో నివాసం ఉంటున్న రోహిత్ కుమార్ సింగ్ కు వంట చేసుకోవడానికి బద్దకించి స్విగ్గీ యాప్ లో ఫుడ్ ను ఆర్డర్ చేశాడు. అయితే ఫుడ్ డెలివరీ ఆలస్యం అయింది. దీంతో రోహిత్  డెలివరీ బాయ్ కు ఫోన్ చేశాడు. సార్ ఐదు నిమిషాల్లో మీకు డెలివరీ చేస్తా అని చెప్పాడు.. అయితే అరగంట అయినా ఫుడ్ ని డెలివరీ బాయ్ తీసుకుని రాలేదు. దీంతో ఆకలి అధికం అయింది.. అసహనంతో రోహిత్ కుమార్ మళ్ళీ ఆ డెలివరీ బాయ్ కు ఫోన్ చేశాడు.. బ్రదర్ త్వరగా రండి.. నాకు చాలా ఆకలిగా ఉందని చెప్పాడు. కొద్ది సేపటి తర్వాత డోర్‌బెల్ రింగ్ అయింది. తనకు ఫుడ్ ని ఆలస్యంగా తీసుకుని వచ్చిన ఆ డెలివరీ బాయ్ మీద కోపం వచ్చింది.. బాగా తిట్టాలనే ఉద్దేశ్యంతో కోపంగా డోర్ తీశాడు రోహిత్.. అయితే అక్కడ తనకు ఫుడ్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని చూసి షాక్ తిన్నాడు.

స్విగ్గీ డెలివరీ బాయ్‌ కు సుమారు 40 ఏళ్లు ఉంటుంది. నెరిసిన జుట్టు, ఊతకర్రల సాయంతో నిల్చుని.. చేతిలో ఫుడ్ కవర్ ని డెలివరీ ఇవ్వడానికి రెడీ అవుతూ.. చిరునవ్వుతో  గుమ్మం ముందు నిల్చున్నాడు. అతనిని చుసిన రోహిత్ కు కోపం స్తానంలో తన ప్రవర్తన గుర్తుకొచ్చి సిగ్గు అనిపించింది. ఒక క్షణం తాను షాక్ కి గురయ్యానని.. అనంతరం అతనికి తన ప్రవర్తన పట్ల క్షమాపణ చెప్పినట్లు రోహిత్ చెప్పారు. అనంతరం అతని గురించి తెలుసుకోవడానికి మాటలు కలిపినట్లు చెప్పాడు రోహిత్.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. ఆ డెలివరీ బాయ్ పేరు కృష్ణప్ప రాథోడ్. కరోనా రాకముందు వరకూ ఒక కెఫేలో పనిచేసేవారు. అయితే కరోనా సమయంలో ఉద్యోగాన్ని కోల్పోయాడు. కుటుంబ పోషణ కోసం కృష్ణప్ప స్వీగ్గి డెలివరీ బాయ్ మారినట్లు చెప్పాడు. అయితే తన సంపాదనలో కుటుంబం అంతా బెంగళూరులో ఉంచి చదివించలేనని.. అందుకే పల్లెటూరిలో కుటుంబాన్ని ఉంచినట్లు చెప్పాడు కృష్ణప్ప. అంతేకాదు.. తనకు మరో డెలివరీ ఉందని.. ఆలస్యం అవుతుందంటూ వెళ్లిపోయాడని అతని గురించి రోహిత్ చెప్పాడు. హృదయవిదారకమైన కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ఈ పోస్టు పై స్పందిస్తున్నారు. హృదయాన్ని హత్తుకునే చిరునవ్వు , అతని కళ్ళలో కలలు మంచి రోజులు తెస్తాయంటూ కామెంట్ చేస్తున్నారు. కృష్ణప్ప ఆత్మవిశ్వాసంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఎవరైనా కృష్ణప్పకు  సాయం చేయాలనుకుంటే తనకు మెసేజ్ చేయాలని రోహిత్ పేర్కొన్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..