Medina: గుట్టలు గుట్టలుగా బయటపడిన బంగారం, రాగి నిక్షేపాలు.. నోరెళ్లబెట్టిన అధికారులు.. ఎక్కడో తెలుసా..

మదీనా ప్రాంతంలో గుట్టల కొద్దీ బంగారం నిక్షేపాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అల్ మదీక్ ప్రాంతంలోని నాలుగు చోట్ల రాగి ఖనిజం ఉన్నట్టు గుర్తించామని ఆ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Medina: గుట్టలు గుట్టలుగా బయటపడిన బంగారం, రాగి నిక్షేపాలు.. నోరెళ్లబెట్టిన అధికారులు.. ఎక్కడో తెలుసా..
Saudi Arabia
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 24, 2022 | 4:24 PM

Medina : పవిత్ర నగరం మదీనాలో బంగారం, రాగి ఖనిజం నిక్షేపాలు ఉన్నాయని సౌదీ అరేబియా ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలోనే సౌదీ అరేబియాలో భారీ ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలు బయటపడ్డాయి. ముస్లింలకు పుణ్యక్షేత్రమైన మదీనాలో అపారమైన బంగారం, రాగి ఖనిజాలు ఉన్నట్టు గుర్తించామని సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది. మదీనా ప్రాంతంలోని అబా అల్ రహా వద్ద బంగారం నిక్షేపాలు ఉన్నాయని సౌదీ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అల్ మదీక్ ప్రాంతంలో నాలుగు చోట్ల రాగి ఖనిజం ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. తాజా ఆవిష్కరణల ద్వారా భవిష్యత్ పెట్టుబడుల దిశగా మరిన్ని అవకాశాలకు ద్వారాలు తెరుస్తున్నామని సౌదీ జియోలాజికల్ సర్వే పేర్కొంది.

కాగా, ఈ నూతన నిక్షేపాల ద్వారా సౌదీకి 533 మిలియన్ డాలర్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉందని, 4 వేల ఉద్యోగాలు కూడా లభిస్తాయని స్థానిక మీడియా పేర్కొంది. సౌదీ అబిరేయాలో 5,300 ప్రాంతాల్లో ఖనిజ లవణాలు లభ్యమవుతాయని సౌదీ జియాలజిస్ట్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ చైర్మన్ అబ్దులజీజ్ బిన్ లబాన్ గతంలో తెలిపారు. వీటిలో వివిధ రకాల లోహ, నాన్-మెటాలిక్ శిలలు, నిర్మాణ వస్తువులు, అలంకారమైన శిలలు, రత్నాలు ఉన్నాయని చెప్పారు.

క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ స్థాపించిన గాడ్స్ విజన్ 2030లో భాగంగా విస్తరణ కోసం గుర్తించిన రంగాలలో మైనింగ్ ఒకటి. జూన్‌లో క్రౌన్ ప్రిన్స్ పరిశోధన, అభివృద్ధి రంగానికి జాతీయ ప్రాధాన్యతలను ప్రకటించారు. ఇందులో భాగంగానే..ఈ దశాబ్దం చివరి నాటికి మైనింగ్ రంగంలో 170 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తున్నట్లు సౌదీ అరేబియా ఈ ఏడాది ప్రారంభంలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి