AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇన్నాళ్లకు రైలుకూత.. మెతుకుసీమలో పరుగులు తీసిన తొలి ప్యాసింజర్‌ రైలుబండి..

మెతుకుసీమ కల సాకారమైంది. మెదక్‌ వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది. మెదక్‌-అక్కన్నపేట రైల్వేలైన్‌ను జాతికి అంకితం చేశారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.

Telangana: ఇన్నాళ్లకు రైలుకూత.. మెతుకుసీమలో పరుగులు తీసిన తొలి ప్యాసింజర్‌ రైలుబండి..
Medak Akkannapet Railway Li
Jyothi Gadda
|

Updated on: Sep 23, 2022 | 9:49 PM

Share

Telangana: ఒకప్పుడు సుభాగా వెలుగొందిన మెదక్‌.. తర్వాతి కాలంలో ఆ వైభవాన్ని కోల్పోయింది. సమైక్యాంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ డివిజన్‌కే పరిమితమైన ఈ ప్రాంతం.. ప్రత్యేక రాష్ట్రంలో కొత్త రూపు దిద్దుకుంటోంది. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడంతో మెదక్‌ దశ తిరిగింది. దశాబ్దాల తర్వాత మెదక్‌ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. ఏళ్ల నాటి కృషి ఫలితంగా మెదక్‌ ప్రాంత వాసుల రైలు కల నెరవేరింది. 204 కోట్ల రూపాయలతో నిర్మించిన అక్కన్నపేట-మెదక్‌ రైల్వేలైన్‌ను జాతికి అంకితం చేశారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. కాచిగూడ-మెదక్‌ ప్యాసింజర్‌ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మించాయి. భూ సేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించింది. కాస్ట్ షేరింగ్ విధానంలో 2012-13 రైల్వే బడ్జెట్‌లో ఈ మార్గానికి మోక్షం లభించింది. 2014 జనవరిలో రైల్వేలైన్ పనులకు శంకుస్థాపన జరిగింది. 2015లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.

రైల్వేలైన్‌ ప్రారంభోత్సవంలో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. మెదక్‌ వాసుల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. మెదక్‌ వాసులకు ఇవాళ పండుగ రోజన్నారు. అంతకుముందు.. మెదక్‌-అక్కన్నపేట నూతన రైల్వేలైన్‌ ప్రారంభోత్సవంలో గందరగోళం చెలరేగింది. అధికారిక కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల నినాదాలు ఉద్రిక్తతను రాజేశాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎదుట టీఆర్‌ఎస్‌- బీజేపీ క్యాడర్‌ పోటాపోటీ నినాదాలకు దిగాయి. రైల్వేస్టేషన్‌ నినాదాలతో దద్దరిల్లింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి