AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt schools: ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్లను శుభ్రం చేస్తున్న బాలికలు…!! రాజకీయ దుమారం..

బాలికలు టాయిలెట్లు శుభ్రం చేయలేదని, వర్షం కారణంగా మురికిగా ఉండడంతో ఆవరణలోని చేతిపంపులోంచి నీటిని తీసుకుంటున్నారని విచారణలో డీఈవో చెప్పారు.

Govt schools: ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్లను శుభ్రం చేస్తున్న బాలికలు...!! రాజకీయ దుమారం..
Govt School
Jyothi Gadda
|

Updated on: Sep 23, 2022 | 9:09 PM

Share

Govt schools: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆడపిల్లల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం బాలికలకు మెరుగైన విద్య, పోషకాహారంతో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. బేటీ పఢావో బేటీ బచావో పథకం ద్వారా ఆడపిల్లల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ధ్యేయంగా ఉంది. ఆరోగ్యం, అక్షరాస్యత అవగాహన ఇలా అనేక రంగాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అయితే బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని కొన్ని చిత్రాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.. రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపింది. అదేంటంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలు యూనిఫాం ధరించి టాయిలెట్లను శుభ్రం చేస్తున్న ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని గుణ (Guna district) జిల్లా చక్‌దేపూర్ (Chakdeopur village) గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ యూనిఫాంలో ఉన్న కొంతమంది బాలికలు ఇక్కడ టాయిలెట్లను((Cleaning Toilets) శుభ్రం చేస్తున్నారు. వైరల్ ఫోటోలలో, అమ్మాయిలు చీపురు, బకెట్, మగ్ పట్టుకుని కనిపిస్తున్నారు. బాలికలు 5, 6 తరగతుల విద్యార్థులు జిల్లాలోని చక్‌దేవ్‌పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. పాఠశాల ముగిసిన తర్వాత బాలికలు స్కూల్ టాయిలెట్లను బలవంతంగా శుభ్రం చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బాలికలు మరుగుదొడ్డి నేల తుడుచుకోవడం, ఒక బాలిక పాఠశాల ఆవరణలోని చేతి పంపు నుండి నీరు తెచ్చుకోవడం ఫోటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. ఈ వివాదాస్పద ఘటన సెప్టెంబర్ 20న జరిగింది.

ఇవి కూడా చదవండి

అయితే సాయంత్రం పాఠశాలలోని మరుగుదొడ్లను బాలికలను బలవంతంగా శుభ్రం చేయిస్తున్నారనే వార్తలను జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ఖండించారు. విద్యార్థుల వైరల్ ఫోటోలలో చీపురు, మగ్గు చూడవచ్చు. బాలికలు మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న దృశ్యాలను ఫోటోలు చూపిస్తున్నాయి. అయితే ఈ ఘటనను జిల్లా విద్యాశాఖాధికారి సున్నితంగా ఖండించారు. విచారణలో డీఈవో సోనమ్ జైన్ మాట్లాడుతూ.. బాలికలు టాయిలెట్లు శుభ్రం చేయలేదని, వర్షం కారణంగా మురికిగా ఉండడంతో ఆవరణలోని చేతిపంపులోంచి నీటిని తీసుకుంటున్నారని చెప్పారు.

కాగా, దీనిపై బాలికలు, వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది స్టేట్‌మెంట్‌లను తాను రికార్డ్ చేశానని జైన్ చెప్పారు. టాయిలెట్‌ను శుభ్రం చేయమని విద్యార్థులను కోరడాన్ని వారందరూ ఖండించారు.

మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర పంచాయతీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా విచారణకు ఆదేశించారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ బృందం కూడా గురువారం పాఠశాలను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్నామని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి