AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Newborn Baby: ఇదేక్కడి విచిత్రంరా బాబు.. నిన్న ప్రెగ్నెన్సీ… నేడు బేబీ – షాక్ అయిన తల్లి!

మాలి గర్భవతి అని తెలిసిన ఆ మర్నాడు.. తాను యధావిధిగా రోజువారి పనికి వెళ్లింది. భోజన విరామ సమయంలో తన తల్లిని కలిసేందుకు వెళ్లింది. అంతలోనే మాలికి పురిటి నొప్పులు మొదలయ్యాయి.

Newborn Baby: ఇదేక్కడి విచిత్రంరా బాబు.. నిన్న ప్రెగ్నెన్సీ... నేడు బేబీ - షాక్ అయిన తల్లి!
kidnap
Jyothi Gadda
|

Updated on: Sep 23, 2022 | 8:00 PM

Share

Newborn Baby: స్త్రీలు గర్భవతి అయినప్పుడు సాధారణంగానే వారి శరీరంలో మార్పులు గమనిస్తారు. బరువు పెరగడం, పొట్ట పెరగడం వంటి మార్పులను అనుభవిస్తారు. అయితే, ఆమె గర్భవతి అయినప్పుడు.. అందరికీ 2-3 నెలల తర్వాత తెలుస్తుంది. ఇక్కడ మాత్రం ఓ మహిళకు తన ప్రసవం ముందు రోజు తెలిసింది..తాను గర్భవతి..ఇది మీరు నమ్ముతారా? కానీ, ఇది ఇంగ్లండ్‌లో నిజంగానే జరిగిన విచిత్ర సంఘటన. ఇంగ్లండ్‌కు చెందిన మాలి గిల్బర్ట్ అనే 25 ఏళ్ల మహిళ తాను గర్భవతి అని తెలిసిన మర్నాడే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, గత కొన్ని నెలలుగా అస్వస్థతకు గురై చాలాసార్లు ఆస్పత్రికి వెళ్లినా ఎక్కడా విషయం బయటపడలేదట.. చాలా కాలం తర్వాత ఆమె గర్భవతి అని తేలింది.

Newborn Baby

జరిగిన విషయమై..బాధిత మహిళ మాలి మాట్లాడుతూ..గత మార్చి నెల నుంచి తాను బరువు పెరగడం గమనించానని చెప్పింది. ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంటున్నా.. చాలా ఏళ్లుగా బరువు తగ్గుతూ వస్తున్నానని చెప్పింది… కానీ, ఈసారి అందుకు భిన్నంగా.. తనకు వైద్యులు అనేక రకాల టెస్టులు నిర్వహించారని చెప్పింది. అయితే, మార్చి నుండి పరీక్షించినప్పటికీ స్పష్టమైన సమాధానం రాలేదు. కాబట్టి, వారు గత సెప్టెంబర్ 5 న తనకు మరోమారు బ్లడ్‌ టెస్ట్‌ చేశారు. రెండు రోజుల తర్వాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అందులో తనకు ఐరన్‌ తక్కువగా ఉందని, లివర్‌ డ్యామేజ్‌ అయిందని డాక్టర్స్‌ షాకింగ్‌ న్యూస్‌ చెప్పారని మాలి వివరించింది. అయితే, డాక్టర్లు చెప్పిన టెస్ట్‌ రిపోర్టులతో ఉలిక్కిపడిన ఆ మహిళకు గంట వ్యవధిలోనే మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. మరో గంట వ్యవధిలోనే బ్లడ్‌ టెస్ట్‌ కంప్లీట్‌ రిపోర్ట్‌ వచ్చిందని చెప్పారు. రిపోర్ట్‌లో తాను గర్భవతి అని చెప్పారు. అయితే ప్రసవానికి వారం రోజుల సమయం ఉందని వైద్యులు మాలికి భరోసా ఇచ్చారు. మాలికి వచ్చే వారం మరొక రక్త పరీక్ష, స్కాన్ చేయాలని చెప్పారు.. కానీ, అంతలోనే ఊహించని పరిణామం ఎదురైంది. అనుకోని సంఘటనతో అందరూ అవాక్కయ్యారు.

Born Baby

మాలి గర్భవతి అని తెలిసిన ఆ మర్నాడు.. తాను యధావిధిగా రోజువారి పనికి వెళ్లింది. భోజన విరామ సమయంలో తన తల్లిని కలిసేందుకు వెళ్లింది. అంతలోనే మాలికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే మాలి తల్లి అంబులెన్స్‌కి ఫోన్ చేసింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా నిమిషాల వ్యవధిలోనే మాలికి ప్రసవం జరిగిపోయిందని ఆమె ఆశ్చర్యకరంగా చెప్పింది. ప్రస్తుతం తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. మాలికి ఎదురైన ఈ వింత అనుభవానికి సంబంధించిన వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి