AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సెల్ఫీ కోసం అమ్మాయి పర్వతం చివరి అంచున ఫోజులు.. పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్ళిందంటున్న నెటిజన్లు

వైరల్ అవుతున్న వీడియోలో.. బ్రెజిల్‌లోని రియో ​​డి జనీరో నగరం అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు. పర్వతం చివరి భాగంలో ఒక అమ్మాయి గులాబీ రంగు డ్రెస్ వేసుకుని కూర్చొని ఉంది.

Viral Video: సెల్ఫీ కోసం అమ్మాయి పర్వతం చివరి అంచున ఫోజులు.. పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్ళిందంటున్న నెటిజన్లు
Shocking Video Viral
Surya Kala
|

Updated on: Sep 23, 2022 | 7:27 PM

Share

Viral Video: ప్రస్తుతం ఎక్కువమంది సెల్ఫీ మోజుతో ఉన్నారు. సెల్ఫీ తీసుకోవడం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఇప్పటికే చిరుతతో సెల్ఫీ తీసుకుంటున్న వీడియో ఆశ్చర్యపరచగా.. ఇప్పుడు అంతకు మించి షాక్ ఇచ్చే ఒక సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక అమ్మాయి  సెల్ఫీ కోసం పోజులిచ్చిన వీడియోను చూసేందుకు నెటిజన్లు ఆసక్తిని చూపిస్తున్నారు. వాస్తవానికి.. ఈ వీడియోలో ఓ అమ్మాయి పర్వతం చివరి భాగంలో కూర్చుని చిత్రీకరిస్తున్నట్లు కనిపిస్తుంది. చిన్న పొరపాటు జరిగినా ఆ అమ్మాయి పర్వతం నుంచి జారి.. వేల అడుగుల లోతులో పడిపోయే అవకాశం ఉందని క్లిప్‌ చూస్తే తెలుస్తోంది. ఈ వీడియో బ్రెజిల్‌లోని రియో ​​డి జనీరో లో షూట్ చేశారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. బ్రెజిల్‌లోని రియో ​​డి జనీరో నగరం అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు. పర్వతం చివరి భాగంలో ఒక అమ్మాయి గులాబీ రంగు డ్రెస్ వేసుకుని కూర్చొని ఉంది. ఈ వీడియో చూపరులకు నిజంగా షాకింగ్.. ఎందుకంటే అమ్మాయి కూర్చున్న ఎత్తు ,కూర్చున్న ప్రదేశం, అజాగ్రత్త ఇవన్నీ షాకింగ్ కలిగించేవే. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందుకు ఫలితం ఆమె జీవితం కావచ్చు. ఈ వీడియో చూస్తుంటే.. అసలు ఆ యువతికి ఎటువంటి భయం లేనట్లు తెలుస్తోంది. అందుకనే కొండ నుంచి కిందకు జారుతూ.. చేతులు పైకి ఎత్తి నవ్వుతూ మరీ వీడియోకి ఫోజులు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

అమ్మాయి వీడియోపై ఓ లుక్ వేయండి:

చాలా షాకింగ్ వీడియో @closecalls7 హ్యాండిల్‌తో ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. రియో ​​డి జెనీరో ..  2769 అడుగుల ఎత్తు పర్వతంపై అనే క్యాప్షన్‌ జత చేశారు. సెప్టెంబర్ 19న షేర్ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో భయాందోళనలు సృష్టిస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 48 లక్షలకు పైగా వీక్షించగా, 57 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది.

ఈ వీడియో చూసిన వారంతా అవాక్కయ్యారు.  కొంతమంది మూర్ఖులు మాత్రమే ఇలాంటి చర్య గురించి ఆలోచిస్తాడని వ్యాఖ్యానించగా.. కొంతమంది  ఫోటోకు లైక్స్ పొందాలనే పిచ్చి కోరికతో తమ జీవితాలను బెట్టింగ్ చేస్తున్నారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. పిచ్చి పీక్ స్టేజ్ కు వెళ్లిందని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..