Video Viral: రోడ్ల దుస్థితిపై లైవ్ రిపోర్టింగ్.. ఇంతలో ఊహించని ఘటనకు అంతా షాక్..
వర్షాలు, వరదల కారణంగా రోడ్లు దెబ్బతినడం సహజమే. దారంతా గుంతమమయమై.. గుంతల్లో రోడ్డును వెతుక్కోవాల్సిన పరిస్థితులూ వస్తుంటాయి. ఇలా ధ్వంసమైన రోడ్లపైనే ప్రయాణాలు చేస్తూ ప్రయాణీకులు ఒళ్లు గుల్ల చేసుకుంటారు. బండ్లు..
వర్షాలు, వరదల కారణంగా రోడ్లు దెబ్బతినడం సహజమే. దారంతా గుంతమమయమై.. గుంతల్లో రోడ్డును వెతుక్కోవాల్సిన పరిస్థితులూ వస్తుంటాయి. ఇలా ధ్వంసమైన రోడ్లపైనే ప్రయాణాలు చేస్తూ ప్రయాణీకులు ఒళ్లు గుల్ల చేసుకుంటారు. బండ్లు పాడవడంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. రోడ్లను బాగు చేయాలని ప్రభుత్వానికి, అధికారులకు మొర పెట్టుకుంటుంటారు. ప్రభుత్వం స్పందిస్తే సరి.. లేకుంటే అదే మార్గంలో అలాగే రాకపోకలు సాగిస్తుంటారు. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటే గ్రామస్థులే చందాలు వేసుకుని రోడ్లు వేసుకుంటారు. ఇలాంటి ఘటనలు మనం ఇప్పటికే చాలా చూశాం. కానీ ఓగ్రామంలో రోడ్లు ధ్వంసమయ్యి.. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు అక్కడి దృశ్యాలను వీడియో తీస్తూ న్యూస్ రిపోర్టర్స్ లైవ్ న్యూస్ కవర్ చేస్తుంటారు. అలా ఓ ప్రాంతంలో గుంతల రోడ్లు, వాటితో జరుగుతున్న ప్రమాదాలపై రిపోర్టర్ న్యూస్ కవర్ చేస్తున్నారు. అక్కడి పరిస్థితిని చెబుతూ సెల్ఫీ వీడియో తీస్తున్నారు. ఆ సమయంలో అనుకోని విధంగా ప్రమాదం జరిగింది.
రిపోర్టర్ లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో.. అతని వెనక నుంచి రోడ్డు అంతా గుంతలు పడి, బురదతో నిండి ఉండటాన్ని చూడవచ్చు. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ ఎలక్ట్రిక్ ఆటో గుంతల మీదుగా వెళ్తూ బురదలోనే బోల్తా పడింది. అందులో ఉన్నవారంతా ఆ నీటిలో పడిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని బల్లియా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పీయూష్ రాయ్ అనే జర్నలిస్టు ఈ వీడియోను ట్విట్టర్ లో పెట్టారు. ఇంతకుముందు ఈ ప్రాంతంలో పలు వాహనాలు పడిపోయాయని.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ వీడియోలోని వ్యక్తి చెబుతున్నారు. అలా చెబుతుండగానే వెనుక ఆ రోడ్డుపై వెళుతున్న ఆటో బోల్తా పడింది.
In UP’s Ballia, a reporter was talking to a commuter over poor quality of roads ridden with potholes. The commuter was explaining how accidents and E-rickshaws overturning is very frequent phenomenon. What happened at the end is something you should watch for yourself. pic.twitter.com/PapyCIdb0v
— Piyush Rai (@Benarasiyaa) September 14, 2022
వెంటనే ఆయన వీడియో తీయడం ఆపేసి ఆటోలోని వారిని రక్షించాడు. ఆయనతో పాటు సమీపంలోని వ్యక్తులు కూడా అలర్ట్ అయ్యి, బోల్తా పడిన ఆటోలోని వారిని బయటికి తీశారు. ఘటన గురించి తెలిసి స్థానిక అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసినట్టుగా తెలిపారు. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోను లక్షలమంది వీక్షించారు. అంతే సంఖ్యలో లైక్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం