AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sena vs Sena Row: ముఖ్యమంత్రి కుర్చీలో షిండే కుమారుడు.. సూపర్‌ సీఎం అంటూ విపక్షాల విమర్శలు..

ముఖ్యమంత్రి ఖర్చీలో శ్రీకాంత్ షిండే కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం ఇప్పుడు విమర్శలకు కేంద్ర బిందుగా మారుతోంది. శివసేనలోని మరో వర్గం..

Sena vs Sena Row: ముఖ్యమంత్రి కుర్చీలో షిండే కుమారుడు.. సూపర్‌ సీఎం అంటూ విపక్షాల విమర్శలు..
Eknath Shinde Son
Sanjay Kasula
|

Updated on: Sep 23, 2022 | 6:30 PM

Share

మహారాష్ట్రలో తాజా వివాదం మొదలైంది. కొత్త వివాదానికి కేంద్రంగా ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే మారారు. ముఖ్యమంత్రి ఖర్చీలో శ్రీకాంత్ షిండే కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం ఇప్పుడు విమర్శలకు కేంద్ర బిందుగా మారుతోంది. శివసేనలోని మరో వర్గం ఈ చిత్రాన్ని వైరల్ చేస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే కుమారుడు శ్రీకాంత్‌ శిండే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడంటూ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఆ చిత్రంలో ముఖ్యమంత్రి పీఠంపై శ్రీకాంత్‌ శిండే కూర్చుని ఉన్నారు అంటూ ట్యాగ్ చేశారు. ఆయన చుట్టూ అధికారులు ఉండగా.. ఆయనేవో పేపర్లను పరిశీలిస్తున్నట్లుగా అందులో ఉంది.

దీనికి సంబంధించిన ఫొటో ఇదే అంటూ ప్రచారం మొదలు పెట్టింది.  ఇప్పుడు విపక్షాలు ఈ చిత్రాన్ని తమ అస్త్రంగా మార్చుకుంటున్నాయి. మరోవైపు ఎన్సీపీ నేతలు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఇదిగో “సూపర్‌ సీఎం” అంటూ ఎద్దేవా చేయడం మొదలు పెట్టాయి. మహారాష్ట్రలోని ఎన్సీపీకి చెందిన రవికాంత్‌ వార్పే ఈ ఫొటోను షేర్‌ చేసాయి.

ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు ఆయన కుమారుడు ఇలా ముఖ్యమంత్రి బాధ్యతలు చూస్తున్నారంటూ రవికాంత్‌ వార్పే ఫొటోతో పాటు ట్వీట్‌లో రాసుకొచ్చారు. సూపర్‌ సీఎం అయినందుకు శ్రీకాంత్‌ శిండేకు అభినందనలు అంటూ సెటైర్లను సంధించారు. శ్రీకాంత్ శిండే కుర్చున్న కుర్చీ వెనుక మహారాష్ట్ర ముఖ్యమంత్రి అని రాసి ఉంది. అధికారిక సమావేశాలు లేదా అనధికారిక సమావేశాలకు హాజరు కావాలంటే ముఖ్యమంత్రి కుర్చీ పక్కనే కూర్చోవాలి. కానీ ఇక్కడ ఏకంగా సీట్లోనే కూర్చున్నారు.  ఇది 13 కోట్ల మహారాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ పీఠానికి సంబంధించిన విషయంగా అంటూ పేర్కొన్నారు.

ఏదేమైనా తమ ప్రభుత్వాన్ని కూలదోసి అధికార పీఠమెక్కిన ఏక్‌నాథ్‌ శిందే వర్గాన్ని విమర్శించేందుకు ఉద్ధవ్‌ వర్గానికి శ్రీకాంత్‌ శిందే రూపంలో ఓ ఆయుధం దొరికినట్లయ్యింది.

ఇదిలావుంటే.. బాంబే హైకోర్టు నుంచి ఏకనాథ్ షిండే వర్గానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. శివాజీ పార్క్ వద్ద ‘దసరా ర్యాలీ’కి ఉద్ధవ్ ఠాక్రే హైకోర్టు నుండి అనుమతి లభించింది.  ఏక్‌నాథ్ షిండే వర్గం తరపున దాదర్ ఎమ్మెల్యే సదా సర్వాంకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తనను తాను అసలు శివసేన అని పిలుచుకుంటూ.. సదా సర్వాంకర్ దసరా ర్యాలీని డిమాండ్ చేశారు. ఉద్ధవ్ థాకరే పిటిషన్‌లో జోక్యం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం