Navaratri 2022: ముందే మొదలైన నవరాత్రి శోభ.. తొలిసారిగా అమ్మవారికి అష్టాదశ శక్తిపీఠాల నుంచి సారె..
ఉత్సవాలకు మూడు రోజుల ముందుగానే అంగరంగ వైభవంగా అమ్మవారి శోభాయాత్ర సాగింది. స్థానిక టీటీడీ కళ్యాణ మండపం నుంచి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు.
Navaratri 2022: నెల్లూరులో దేవీన్నవరాత్రి ఉత్సవాల సందడి ముందుగానే మొదలైంది.. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా అష్టాదశశక్తి పీఠాల నుంచి నెల్లూరు నవరాత్రి ఉత్సవాల కోసం సారెను తెప్పించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శరన్నవరాత్రి మహోత్సవాల కోసం అష్టాదశ శక్తిపీఠాల నుంచి చీరలు, అక్షింతలు, కుంకుమ, అభిషేక జలాలు, ప్రత్యేక సారెను తెప్పించారు. ఉత్సవాలకు మూడు రోజుల ముందుగానే అంగరంగ వైభవంగా అమ్మవారి శోభాయాత్ర సాగింది.
స్థానిక టీటీడీ కళ్యాణ మండపం నుంచి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. టీటీడీ వాద్య, నాట్య బృందాల నీరాజనంతో మూడు పల్లకీల్లో అమ్మవారు, అష్టాదశ శక్తిపీఠాల సారెలు, అదిశంకరాచార్యుల వారి ఊరేగింపు కనులవిందుగా సాగింది. అమ్మవారి నామస్మరణలతో సింహపురి మార్మోగింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..