Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ పరిమితి దాటితే వాహనాలకు నో ఏంట్రీ..

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సమయం సమీపిస్తోంది. మరో రెండు నాలుగు రోజుల్లో బ్రహ్మోత్సవాల సందడి మొదలుకానుంది. తిరుమలకు వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో..

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ పరిమితి దాటితే వాహనాలకు నో ఏంట్రీ..
Tirumala
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 23, 2022 | 12:29 PM

Tirumala: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సమయం సమీపిస్తోంది. మరో రెండు నాలుగు రోజుల్లో బ్రహ్మోత్సవాల సందడి మొదలుకానుంది. తిరుమలకు వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల తర్వాత వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్న నేపథ్యంలో భక్తులు భారీగా తరలివస్తారనే అంచనా నేపథ్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు TTD ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శనాల విషయంలో క్లారిటీ ఇచ్చింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల దర్శనాన్ని రద్దుచేయడంతో పాటు, వీవీఐపీలు, వీఐపీ దర్శనంలోనూ పరిమితులు విధించింది. మరోవైపు తిరుమలకు వచ్చే భక్తులు ఎక్కువ మంది సొంత వాహనాల్లో వచ్చే అవకాశం ఉంది. సొంత వాహనాల్లో వచ్చే వారి సంఖ్య ఎక్కువైతే.. తిరుమల కొండకు వెళ్తే దారిలో ట్రాఫిక్ ఇబ్బందితో పాటు భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కొండపైకి వెళ్లే వాహనాల సంఖ్య విషయంలోనూ టీటీడీ పరిమితులు విధించింది.

బ్రహ్మత్సవాలు జరిగే 9రోజుల పాటు కొండపైకి వెళ్లే వాహనాల సంఖ్య 12వేలు దాటితే కొండపైకి వాహనాలను అనుమతించకూడదని నిర్ణయించింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తారనే ఉద్దేశంతో TTD నిఘా, భద్రతా విభాగం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా తిరుమలకు వెళ్లే వాహనాల సంఖ్య 12 వేల దాటితే ఇక వాహనాలను అనుమతించకూడదని నిర్ణయించింది. వాహనాలను తిరుపతిలోని ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు వెళ్లాలని టిటిడి భద్రతా అధికారులు భక్తులకు సూచిస్తున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం గరుడ వాహన సేవ రోజు ఉదయం నుంచి తరువాత రోజె వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతించరు. అయితే ఈఏడాది మాత్రంగ గరుడ సేవ అక్టోబర్ 1వ తేదీ కాగా.. సెప్టుంబర్ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతించకుండా చర్యలు చేపట్టాలని టిటిడి అధికారులు నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే