Andhra Pradesh: ఆ జిల్లాలో ల్యాండ్ మైన్స్‌ కలకలం.. పేలుడు పదార్థాల స్వాధీనం.. ఊపిరిపిల్చుకున్న ప్రజలు..

ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో ల్యాండ్ మైన్స్ కలకలం రేపాయి. కురుపాం మండలం వల్లసబల్లేరు- వలసగూడ రోడ్డులోని రెండో నెంబర్ మైల్‌ రాయి వద్ద రెండు స్టీల్‌ క్యాన్‌లలో ల్యాండ్‌ మైన్స్‌ను గుర్తించారు పోలీసులు. రోడ్డు తవ్వి బాంబ్ స్క్వాడ్ సాయంతో వైర్లు తొలగించారు. 40 కేజీల లాండ్ మైన్స్..

Andhra Pradesh: ఆ జిల్లాలో ల్యాండ్ మైన్స్‌ కలకలం.. పేలుడు పదార్థాల స్వాధీనం.. ఊపిరిపిల్చుకున్న ప్రజలు..
Land Mines
Follow us

|

Updated on: Sep 23, 2022 | 8:27 AM

Andhra Pradesh: ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో ల్యాండ్ మైన్స్ కలకలం రేపాయి. కురుపాం మండలం వల్లసబల్లేరు- వలసగూడ రోడ్డులోని రెండో నెంబర్ మైల్‌ రాయి వద్ద రెండు స్టీల్‌ క్యాన్‌లలో ల్యాండ్‌ మైన్స్‌ను గుర్తించారు పోలీసులు. రోడ్డు తవ్వి బాంబ్ స్క్వాడ్ సాయంతో వైర్లు తొలగించారు. 40 కేజీల లాండ్ మైన్స్ వెలికితీశారు. బాంబ్‌ స్కాడ్‌ సాయంతో ల్యాండ్స్ మైన్స్ ను నిర్వీర్యం చేశారు. ల్యాండ్ మైన్స్ కలకలంతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రెండు క్యాన్లలో సుమారు నలభై కేజీల జిలిటెన్ స్లరి పేలుడు పదార్థాన్ని పెట్టినట్లు గుర్తించారు పోలీసులు. పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు ఊపరిపీల్చుకున్నారు. ల్యాండ్ మైన్స్ బయటపడడంతో ఏజెన్సీ గ్రామాల్లో అప్రమత్తమయ్యారు పోలీసులు. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇది మావోయిస్ట్‌ల పనా? లేక మరేవరైనా? అనే కోణంలో ముమ్మర ధర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

జిలిటెన్ ఎక్కడ నుంచి సేకరించారు? ల్యాండ్ మైన్స్ ఎక్కడ తయారు చేశారు? వాటి ఆనవాళ్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. అంతేకాక ఈ మధ్య కాలంలో వల్లసబల్లేరు-వలసగూడ రోడ్డులో అనుమానంగా కనిపించిన వారి గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయా ఊర్లలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించారా? అనే కోణంలో సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. కొత్త వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వవద్దని.. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే పోలీసులకు సమచారం ఇవ్వాలని ఏజెన్సీ గ్రామాల ప్రజలను హెచ్చరిస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..