AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: మళ్లీ అదే సచిన్.. ఐదు పదుల వయసులోనూ స్టైలీస్ బ్యాటింగ్.. 200 స్ట్రైక్ రేటుతో మాస్టర్ బ్లాస్టర్..

క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ గురించి పరిచయం అవసరం లేదు. క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరికి సచిన్ గురించి తెలియకుండా ఉండదు. భారత క్రికెట్ లో సచిన్ ను అభిమానించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సచిన్ బ్యాటింగ్ కోసం టీవీలకు అతుక్కుపోయేవారు క్రికెట్ ప్రేమికులు. ఓడిపోయే మ్యాచ్ లను..

Cricket: మళ్లీ అదే సచిన్.. ఐదు పదుల వయసులోనూ స్టైలీస్ బ్యాటింగ్.. 200 స్ట్రైక్ రేటుతో మాస్టర్ బ్లాస్టర్..
Sachin
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 23, 2022 | 9:59 AM

Cricket: క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ గురించి పరిచయం అవసరం లేదు. క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరికి సచిన్ గురించి తెలియకుండా ఉండదు. భారత క్రికెట్ లో సచిన్ ను అభిమానించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సచిన్ బ్యాటింగ్ కోసం టీవీలకు అతుక్కుపోయేవారు క్రికెట్ ప్రేమికులు. ఓడిపోయే మ్యాచ్ లను గెలిపించే సత్తా ఉన్న క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్. 2013లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత.. అతగాడి బ్యాటింగ్ ను మిస్సయ్యారు భారత క్రికెట్ అభిమానులు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ వయసు 49 సంవత్సారాలు. ఈవయసులోనూ మాస్టర్ బ్లాస్టర్ బ్యాటింగ్ లో పెద్ద తేడా కనిపించదు. అవే షాట్లు, బాల్ దొరికితే చాలు బౌండరీ దాటల్సిందే. ప్రస్తుతం రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో ఇండియా లెజెండ్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు సచిన్ టెండూల్కర్. గురువారం ఇంగ్లండ్ లెజెండ్స్ పై జరిగిన మ్యాచ్ లో మరోసారి తన స్టైలిస్ బ్యాటింగ్ తో క్రికెట్ అభిమానులను అలరించాడు సచిన్. మాస్టర్ బ్లాస్టర్ బ్యాటింగ్ పై అభిమానులు ట్విట్టర్ వేదికగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అతడి షాట్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఐదు పదుల వయసులోనూ 200 స్ట్రైక్ రేటుతో తన బ్యాటింగ్ సత్తా ఎంటో మరోసారి నిరూపించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా సరే తన ఆటలో ఎటువంటి మార్పులేదని రుజువుచేశాడు. ఇంగ్లాండ్ లెజెండ్స్ పై సెప్టెంబర్ 22వ తేదీన జరిగిన మ్యాచ్ లో మూడు ఫోర్లు, మూడు భారీ సిక్స్ లతో 20 బంతుల్లో 40 పరుగులు చేశాడు మాస్టర్ బ్లాస్టర్. గురువారం సచిన్ బ్యాటింగ్ చూసిన క్రికెట్ అభిమానులు.. ఈవయసులోనూ టెండూల్కర్ ఆటతీరులో ఎటువంటి మార్పు లేదంటూ మురిసిపోయారు. ఈమ్యాచ్ లో సచిన్ 200 స్ట్రైక్ రేటుతో 20 బంతుల్లో 40 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈమ్యాచ్ లో ఇండియా లెజెండ్స్ 15 ఓవర్లలో 170 పరుగులు చేయగా.. ఛేజింగ్ లో ఇంగ్లాండ్ లెజెండ్స్ 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఇండియా లెజెండ్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. సచిన్ బ్యాటింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..