- Telugu News Photo Gallery Cricket photos Sknp vs tkr: dewald brevis 5 balls 5 sixes 30 runs in 6 balls in a row in cpl 2022 Trinbago Knight Riders vs St Kitts and Nevis Patriots
5 బంతుల్లో వరుసగా 5 సిక్సర్లు.. 500 స్ట్రైక్‌రేట్‌తో భయాందోళనలు సృష్టించిన 19 ఏళ్ల బ్యాటర్..
Dewald Brevis: కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన 19 ఏళ్ల బ్యాట్స్‌మెన్ డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి కేవలం 6 బంతుల్లోనే 30 పరుగులతో అజేయంగా నిలిచాడు.
Updated on: Sep 23, 2022 | 9:42 AM

IPL 2023కి ఇంకా 6 నెలల సమయం ఉంది. అయితే ముంబై ఇండియన్స్ అభిమానులు టోర్నమెంట్ ప్రారంభం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ జట్టులో కొంతమంది గొప్ప బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. వీరు కొత్త సీజన్‌లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిలో ఒకరు 19 ఏళ్ల డెవాల్డ్ బ్రెవిస్. అతను కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో తుఫాన్ బ్యాటింగ్‌తో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

సీపీఎల్‌లో తన బ్యాట్‌తో దంచి కొట్టిన దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్‌మెన్ డెవాల్డ్ బ్రెవిస్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌పై కేవలం 6 బంతుల్లో 30 పరుగులు చేసి భయాందోళనలు సృష్టించాడు.

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ తరపున ఆడుతున్న బ్రెవిస్ 19వ ఓవర్లో విండీస్ స్పిన్నర్ అకిల్ హొస్సేన్ వేసిన చివరి 3 బంతుల్లో వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు.

బ్రీవిస్ ఇక్కడితో ఆగలేదు. ఆ తర్వాత అతను చివరి ఓవర్ ఐదు, ఆరో బంతుల్లో స్ట్రైక్‌కి వచ్చాడు. అతను ఈ రెండు బంతులను కూడా సిక్సర్లుగా మలిచాడు. ఈ విధంగా బ్రెవిస్ 6 పరుగులకు 5 వరుస బంతులను బౌండరీలుగా మార్చి సంచలనం సృష్టించాడు.

ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్‌తో బ్రెవిస్ తనదైన ముద్ర వేశాడు. ఆ తర్వాత ముంబై ఐపీఎల్ వేలంలో రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. బ్రీవిస్‌కు కొన్ని మ్యాచ్‌లలో అవకాశాలు వచ్చాయి. అయితే ఆ మ్యాచ్‌లలో కూడా యువ బ్యాట్స్‌మెన్ భారీ షాట్లు కొట్టే సామర్థ్యాన్ని చూపించాడు.





























