- Telugu News Photo Gallery Cricket photos India beat australia by 6 wickets know the reason of team india win
Ind vs Aus: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన రోహిత్ సేన.. థ్రిల్లింగ్ విక్టరీలో రోహిత్ ప్లే చేసిన మ్యాజిక్‌లు ఇవే..
India Vs Australia: రెండో మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇప్పుడు అందరి దృష్టి మూడో మ్యాచ్‌పైనే నిలిచింది.
Updated on: Sep 24, 2022 | 8:16 AM

నాగ్‌పూర్‌లో శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. వర్షం కారణంగా, ఈ మ్యాచ్‌ని ఇన్నింగ్స్‌కు ఎనిమిది ఓవర్లకు కుదించారు. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 90 పరుగులు చేసింది. నాలుగు బంతుల ముందే భారత్ ఈ లక్ష్యాన్ని సాధించింది. భారత్ విజయానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మైదానం, పిచ్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే ఈ మ్యాచ్‌లో టాస్ చాలా కీలకంగా మారింది.

అక్షర్ పటేల్ అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియాకు శుభారంభం ఇవ్వలేదు. స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్‌పై రోహిత్.. అక్షర్ పటేల్‌కు వరుసగా రెండు ఓవర్లు ఇచ్చి ఓ ట్రిక్ ప్లే చేశాడు. పటేల్ రెండు ఓవర్లలో 13 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసి ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు చల్లాడు.

భారత్‌కు 91 పరుగుల లక్ష్యం ఉంది. ఈ కష్టమైన లక్ష్యం ముందు, భారత్‌కు రోహిత్ అందించిన శుభారంభం అదిరింది. రోహిత్ చివరి వరకు నిలిచి అజేయంగా 46 పరుగులతో జట్టును గెలిపించగలిగాడు.

ఆస్ట్రేలియా బౌలర్ బలహీనమైన బౌలింగ్ కారణంగా రోహిత్ పరుగుల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా షార్ట్ బౌలింగ్ చేసింది. దీనిని రోహిత్ సద్వినియోగం చేసుకున్నాడు. సరైన లైన్ లెంగ్త్ లేకపోవడం ఆస్ట్రేలియా బౌలర్లలో కూడా కనిపించింది.




