Navratri 2022: పూజలు, వ్రతాల సమయంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరో తెలుసా.. దీని వెనుక అసలైన కారణం ఇదే!
సాత్విక్ ఆహార పదార్థాలు ఆధ్యాత్మిక పురోగతిని అందజేస్తాయని నమ్ముతారు. ఇది కొన్ని మినహాయింపులతో అన్ని శాఖాహార ఆహార పదార్థాలను సాత్విక్ వర్గంలోకి తీసుకువస్తుంది.
Navratri 2022: శరన్నవరాత్రుల శుభ సందర్భం ఆసన్నమైంది. ప్రజల్లందరిలోనూ ఆ ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4వరకు 9 రోజుల పాటు దసరా ఉత్సవాలు కొనసాగుతాయి. పండగతో పాటు 5వ తేదీన అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు భక్తులు. 9 రోజుల ఉత్సవం దుర్గాదేవి అంకితం చేయబడింది. ఈ సమయంలో అమ్మవారి తొమ్మిది వేర్వేరు అవతారాలను ప్రార్థిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతికగా విజయదశమిని జరుపుకుంటారు. దుర్గాష్టమిని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరుపుకుంటారు. ఇక ఈ 9 రోజులు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. అందులో ఉల్లిపాయ, వెల్లుల్లి ప్రధానంగా నిషేధిస్తారు. కానీ, ఎందుకు..? అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అది ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం..
సాత్విక ఆహారం.. సాత్విక ఆహారం స్వచ్ఛమైన శాఖాహార ఆహారం. ఇందులో కాలానుగుణ తాజా పండ్లు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, మొలకలు, పలుకులు, విత్తనాలు, తేనె, తాజా మూలికలు ఉంటాయి. ఇది మనస్సును స్వచ్ఛంగా, శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. సాత్విక ఆహారాన్ని భుజించేవారు ప్రేమ, కృతజ్ఞత, అవగాహనతో ఉంటారు. వారిలో ప్రశాంతత కనిపిస్తుంది, నిర్మలమైన చిరునవ్వు, స్నేహశీలి, శక్తి, ఉత్సాహం, ఆరోగ్యం, ఆశ, ఆకాంక్షలు, సృజనాత్మకత ఇలా సమతుల్య వ్యక్తిత్వంతో నిండి ఉంటారు.
రజాసిక్ ఆహారం.. రజాసిక్ ఆహారంలో ప్రధానంగా మసాలా దినుసులు, ఉల్లి, వెల్లుల్లి, ఇతర సుగంధ ద్రవ్యాలు , డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, కాఫీ, టీ, రిఫైన్డ్ ఫుడ్ ఐటమ్స్, షుగర్ ఫుడ్స్, చాక్లెట్‌లు వంటి సుసంపన్నమైన రుచి ఉండే ఆహారాలు ఉంటాయి. ఇలాంటి ఆహారాలను భుజిస్తే తక్షణ శక్తి లభిస్తుంది కానీ, ఆ శక్తి వెంటనే ఖర్చయిపోతుంది. శరీర సమతుల్యతను భంగపరుస్తుంది. బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉంటుంది. ఎప్పుడూ తినడానికి ఆత్రుత ప్రదర్శిస్తారు. కోపంగా ఉంటారు, అవిశ్రాంతంగా, ఆందోళనగా ఉంటారు.
తమాసిక్ ఆహారం.. ఇందులో ప్రధానంగా మళ్లీ వేడిచేసిన ఆహారాలు, రసాయనికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, గుడ్లు, మాంసం, ఆల్కహాల్, సిగరెట్లు మొదలైనవి ఉంటాయి. తామసిక్ ఆహారాన్ని భుజించే వారు నిస్తేజంగా, ఊహకు అందని విధంగా, ఎలాంటి ప్రేరణ లేకుండా, బద్ధకంగా, అజాగ్రత్తగా, నీరసంగా ఉంటారు. వీరికి మధుమేహం, ఊబకాయం, కాలేయ వ్యాధి వంటి అనారోగ్యాలను అనుభవిస్తారు. మనస్సు లేదా శరీరానికి హాని కలిగించే ఆహారాన్ని ప్రకృతిలో తామసిక్ గా పరిగణిస్తారు. ఇది మానసిక మందగమనాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. ఉల్లి, వెల్లుల్లి ప్రకృతిలో తామసిక్‌గా వర్గీకరించబడినందున తొమ్మిది రోజుల పాటు జరిగే పవిత్ర పండుగ సమయంలో అవి నిషేధించబడ్డాయి.
నవరాత్రి సమయంలో ఉల్లిపాయ-వెల్లుల్లిని ఎందుకు వంటలో వినియోగించరో ఇప్పుడు మీకు తెలిసింది కదా..
మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి