Telangana: హడలెత్తిస్తున్న ముసుగు దొంగలు.. ఏకంగా ఒకే రోజు రెండు షోరూమ్‌లు లూటీ..

సీసీ పుటేజ్ లో దొంగల చోరీ విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నా ముసుగులు ధరించి ఉండటంతో గుర్తించడం కాస్త కష్టంగా మారిందంటున్నారు పోలీసులు.

Telangana: హడలెత్తిస్తున్న ముసుగు దొంగలు.. ఏకంగా ఒకే రోజు రెండు షోరూమ్‌లు లూటీ..
Thieves
Follow us

|

Updated on: Sep 22, 2022 | 9:03 PM

Telangana: జాతీయ రహదారి, శివారు ప్రాంతాలే టార్గెట్ గా ముసుగు దొంగలు రెచ్చిపోతున్నారు. పక్కా స్కెచ్ వేసి అందినకాడికి దోచుకెళుతున్నారు. అడ్డొస్తే డమ్మీ తుపాకీతో బెదిరించడం.. దాడులు చేసి పరారవ్వడం ఈ ముఠాల పని. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఈ తరహా ఘటనలు కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలే టార్గెట్ గా సాగుతున్న దొంగతనాలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దొంగల భయంతో గ్రామ యువత రక్షక దళాలుగా ఏర్పడి తమ ప్రాంతాలను కాపాడుకుంటున్నారు. దుకాణాలు , ఇళ్లు , గుళ్లు అన్న తేడా లేకుండా పక్కా స్కెచ్ వేసి యదేచ్చగా దోచేస్తున్నారు దొంగలు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దొంగలు హడలెత్తిస్తున్నారు. పల్లెలు , పట్నాలు , జిల్లా కేంద్రాలు అనే తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. నిర్మల్ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన బైంసా, కుబీర్ , ముథోల్ ప్రాంతాలలో ముసుగు దొంగల సంచారం కలకలం రేపుతుంటే.. ఇటు కొమురం భీం జిల్లాలో ఏకంగా పోలీసుల ఇళ్లనే లూటీ చేస్తున్నారు దొంగలు. బైంసాలో ఒకే రోజు మూడు దుకాణాల్లో చోరీకి పాల్పడగా.. కొమురంభీం జిల్లా పెంచికల్ పేటలో ఎస్సై ఇంటినే దోచేయడానికి యత్నించారు దొంగలు. వారం రోజుల వ్యవదిలో ఉమ్మడి జిల్లాలో 25 దొంగతనాల కేసులు నమోదవగా.. మూడు చోట్ల ఒకే తరహాలో చోరీకి యత్నించారు దొంగలు.

ఇటు జిల్లా కేంద్రాలైన ఆదిలాబాద్ , నిర్మల్ లలో కారు షోరూములే టార్గెట్ ముసుగు దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజు రెండు వేరు వేరు ప్రాంతాలలో ఒకే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లా మావల మండల కేంద్రం శివారులోని జాతీయ రహదారికి సమీపంలో ఉన్న కారు షోరూంలో మంగళవారం రాత్రి సినీ ఫక్కీలో చోరీ చేశారు దొంగలు. అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో కారు షోరూంలోకి చొరబడ్డ దొంగలు.. ముఖాలు కనిపించకుండా మాస్కులు వేసుకుని షోరూంలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ రాత్రి డ్యూటీ చేస్తున్న వాచ్‌మన్‌ ఆరిపెల్లి భూమన్నను పిస్తోల్‌ చూపించి బెదించి.. బాత్‌రూంలో బందించారు. షోరూం లోకి చొరబడి లాకర్ ఎత్తుకెళ్లారు. లాకర్ లో 3 లక్షల రూపాయల నగదు ఉన్నట్టు షోరూం యజమాని పోలీసులకు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

అటు నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారి 44 పక్కన ఉన్న హుండాయ్‌ కారు షోరూంలోనూ దొంగలు ఆదిలాబాద్ తరహా చోరికి యత్నించారు. కారు షోరూంలోకి చొరబడ్డ నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో సెక్యురిటీగార్డ్ పై దాడి చేసి షోరూంలోకి దూసుకెళ్లారు. షోరూం లో నగదు లభించకపోవడం తో అక్కడి నుండి ఉడాయించారు. అటు ఆదిలాబాద్ ఇటు నిర్మల్ జిల్లాలోని కారు షోరూంలలో చోరీకి పాల్పడింది నలుగురు వ్యక్తులే కావడం ఒకే తరహా ఘటన చోటు చేసుకోవడం.. ముసుగులు దరించి ఉండటం.. రెండు ప్రాంతాలు జాతీయ రహదారి 44 కి సమీపంలోనే ఉండటంతో రెండు వేరు వేరు ముఠాల లేక ఒకే ముఠా చోరీలకు పాల్పడింద అన్న కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

సీసీ పుటేజ్ లో దొంగల చోరీ విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నా ముసుగులు ధరించి ఉండటంతో గుర్తించడం కాస్త కష్టంగా మారిందంటున్నారు పోలీసులు. మరో వైపు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో దొంగలు సంచరిస్తున్నారన్న సమాచారంతో యువత గ్రామ రక్షణ దళాలుగా ఏర్పడి గస్తీ కాస్తున్నారు. పండుగ సెలవులు కూడా దొంగలకు కలిసి వచ్చే అవకాశం ఉండటంతో సెలవుల్లో ఊర్లకు వెళ్లే వారు సమీప పోలీస్ స్టేషన్ లలో సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్
నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.