Kerala: మద్యం కోసం దారుణం.. కన్నతల్లిని సజీవ దహనం చేసిన తాగుబోతు కొడుకు..
దాంతో భాదితురాలు అరుపులు కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీసింది. అది గమనించిన స్థానికులు ఆమెకు రక్షించే ప్రయత్నం చేశారు. మంటలార్పివేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ,
Kerala: మద్యం కోసం డబ్బులు ఇవ్వని తల్లిని సజీవ దహనం చేశాడు ఓ తాగుబోతు కొడుకు. ఈ షాకింగ్ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలోని సమ్మనూర్ ప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ తాగుబోతు కొడుకు తన తల్లిని సజీవ దహనం చేశాడు. దీంతో తల్లిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సమ్మనూర్ ప్రాంతానికి చెందిన శ్రీమతి (75) అనే మహిళ తన కుమారుడు మనోజ్ (53)తో కలిసి నివసిస్తోంది. ఈక్రమంలోనే సెప్టెంబర్-20న తల్లి శ్రీమతి, కొడుకు మనోజ్ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ తర్వాత మనోజ్ తన తల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.
దాంతో భాదితురాలు అరుపులు కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీసింది. అది గమనించిన స్థానికులు ఆమెకు రక్షించే ప్రయత్నం చేశారు. మంటలార్పివేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే 85 శాతానికి పైగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరింది. మెరుగైన వైద్యం కోసం ఆమెను వెంటనే కున్నంకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం త్రిసూర్‌లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
బాధితురాలి పరిస్థితి విషమించడంతో ఎర్నాకులంలోని మరో ఆస్పత్రికి తరలించారు. ఇలా అట్నుంచి ఇటు, ఇటు అట్నుంచి తిప్పుతు ఆలస్యం జరిగిపోయింది. దాంతో చికిత్స అందక ఆ మహిళ చివరకు సెప్టెంబర్ 21న మృతి చెందింది. పోలీసులు మనోజ్‌ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మద్యం కోసం డబ్బులు అడిగి తల్లి శ్రీమతిపై కొడుకు మనోజ్ దాడి చేసేవాడని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి