Viral Video: వారెవ్వా.. ఏం స్టైల్ గురూ.. హెయిర్ కట్ కోసం ఏకంగా సెలూన్ కు వచ్చిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ట్విట్టర్‌లో విపరీతమైన వ్యూస్‌తో దూసుకుపోతుంది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video: వారెవ్వా.. ఏం స్టైల్ గురూ.. హెయిర్ కట్ కోసం ఏకంగా సెలూన్ కు వచ్చిన కోతి..  ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Monkey
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 22, 2022 | 5:23 PM

Viral Video: కోతి పేరు చెప్పగానే ముఖంపై చిరునవ్వు వచ్చేస్తుంది. దానికి ఆ పేరు కూడా ఊరికే రాలేదు. వాటి చేష్టలు అన్నీఇన్నీ కావు..అందుకే కోతి చేష్టలు అంటారు. ఇటీవలి కాలంలో వానర చేష్టలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పల్లెపట్నం అనే తేడా లేకుండా విచ్చల విడిగా సంచరిస్తున్న కోతులు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇళ్లు, పంటపొలాలు నాశనం చేస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తున్న వానరాలు ఇళ్లలోకి రావడంతో జనం భయపడుతున్నారు. వాటికి అడవిలో సరయిన ఆహారం లేక జనావాసాల బాటపడుతున్నాయి.

అలా మనుషులను అనుకరిస్తున్న కోతుల వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిలో కొన్ని వీడియోలు ఆసక్తికరంగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు కడుపుబ్బా నవ్వి్స్తాయి. ఇప్పుడు ఓ కోతిని సెలూన్‌లో ట్రిమ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇండియన్ పోలీస్ సర్వీసెస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కేవలం 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో..ఓ కోతి సెలూన్‌లోని అద్దం ముందు కుర్చీపై కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఇక ఆ కోతి కాలర్ చుట్టూ క్లాత్‌ చుట్టబడి ఉంది. బార్బర్‌ కోతి జుట్టును దువ్వెన చేసి, ఎలక్ట్రిక్ ట్రిమ్మర్‌తో వాటిని కత్తిరించడం ప్రారంభిస్తాడు. మంగలి తన పని చేస్తున్నప్పుడు కోతి ఓపికగా కూర్చుంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ట్విట్టర్‌లో విపరీతమైన వ్యూస్‌తో దూసుకుపోతుంది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒక వినియోగదారు క్యా బాత్ హై అంటుంటే.. మరొకరు కోతులు కూడా ఇలాంటి వ్యాపారాన్ని డెవలప్‌ చేయాలనుకుంటున్నాయి..అంటూ ఫన్నీ కామెంట్‌ చేశారు. మొత్తానికి క్యూట్‌ కట్టింగ్‌తో మంకీ మస్త్‌ బ్యూటీఫుల్‌గా ఉందంటున్నారు తెగ నవ్వుకుంటున్నారు ఇంకొందరు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?