Viral News: అరుదైన ఘటనతో వారి ఆనందం నాలుగు రెట్లు.. 5 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా..

కుని సునాకు నెలలు నిండటంతో సంభాల్‌పూర్‌లోని వీర్‌ సురేందర్‌ సాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. పురిటి నొప్పులు రావడంతో వైద్యులు ఆమెకు సాధారణ కాన్పు చేశారు.

Viral News: అరుదైన ఘటనతో వారి ఆనందం నాలుగు రెట్లు.. 5 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా..
Newborn Baby Death
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 22, 2022 | 3:05 PM

Viral News: ఒడిశాలో అరుదైన ఘటన చోటుచేసుకున్నది. సంభాల్‌పూర్‌లోని సోనేపూర్‌కు చెందిన కుని సునా అనే మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. కుని సునాకు నెలలు నిండటంతో సంభాల్‌పూర్‌లోని వీర్‌ సురేందర్‌ సాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. పురిటి నొప్పులు రావడంతో వైద్యులు ఆమెకు సాధారణ కాన్పు చేశారు. ఈ క్రమంలో ఆమె నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తొలుత కవల పిల్లలు పుట్టారని, వారిద్దరు ఆడపిల్లలని వైద్యులు చెప్పారు. మళ్లీ 2.02 గంటలకు మరో పాపకు జన్మనిచ్చిందని, 2.04 గంటల సమయంలో ఒక బాబు పుట్టాడని తెలిపారు.

కాగా, నలుగురు పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. అయితే వారు కొద్దిగా బరువు తక్కువగా ఉండటంతో స్పెషల్‌ న్యూబార్న్‌ కేర్‌ యూనిట్‌కు ఉంచి చికిత్స అందజేస్తున్నారు. ఇలా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించడం చాలా అరుదని… 5.12 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా నలుగురు పిల్లలు పుట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. పైగా, అటువంటి సందర్భాలలో డెలివరీ సాధారణంగా చాలా క్లిష్టంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి
Woman Gives Birth To 4 Babi

కానీ, కుని నార్మల్‌ డెలీవరిలోనే నలుగురికి జన్మనిచ్చింది. తమ ఆస్పత్రిలో ఇలా జరగడం ఇదే మొదటిసారిగా వైద్యులు వెల్లడించారు. ఇక, ఒకేసారి నలుగురు పిల్లలుపుట్టడంతో కుని కుటుంబీకుల ఆనందానికి అవధులు లేవు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ